అల్లు శిరీష్ పెళ్లి వెనుక నితిన్ దంపతుల హస్తం.. నయనికాతో లవ్ స్టోరీ అక్కడే మొదలైందట!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ ఫ్యామిలీ అల్లు వారి ఇంటిలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యువ హీరో అల్లు శిరీష్ వివాహానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవలే అల్లు శిరీష్ నిశ్చితార్థం నయనికా రెడ్డితో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో వారి వివాహానికి అల్లు, నయనికా కుటుంబం ముహుర్తం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్, నయనికా రెడ్డి ప్రేమ కథ గురించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ క్యూట్ లవ్ స్టోరి వివరాల్లోకి వెళితే..
అల్లు శిరీష్ తన పెళ్లి నిశ్చితార్థాన్ని భావోద్వేగమైన పరిస్థితుల్లో జరుపుకొన్నారు. అక్టోబర్ 1వ తేదీన తన తాత గారు అల్లు రామలింగయ్య జయంతి సందర్బంగా తన ఎంగేజ్‌మెంట్ గురించి ప్రకటించారు. నయనికాతో నా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ విషయాన్ని ఆనందంగా, సంతోషకరమైన పరిస్థితుల మధ్య మీతో పంచుకొంటున్నాను అని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు.

అయితే అల్లు శిరీష్, నయనికాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం కాబోతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ గత కొద్దికాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. శిరీష్, నయనిక మద్య పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈ పెళ్లికి కారణం హీరో నితిన్, ఆయన భార్య షాలిని అవ్వడం ఈ లవ్ స్టోరీలో ట్విస్టుగా మారింది.
వాస్తవానికి అల్లు, మెగా ఫ్యామిలీతో హీరో నితిన్‌కు మంచి బాండింగ్ ఉన్న విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహాన్ని పురస్కరించుకొని ఆ నూతన వధూవరులకు నితిన్ దంపతులు ఓ విందును ఏర్పాటు చేశారు. ఆ విందుకు మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శిరీష్ కూడా పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీకి నితిన్ భార్య షాలిని క్లోజ్ ఫ్రెండ్ నయనికా రెడ్డి కూడా వచ్చారు. అక్కడే వారిద్దరికి పరిచయం జరిగిందట.
అలా నితిన్ ఇచ్చిన పార్టీలో జరిగిన అల్లు శిరీష్, నయనిక రెడ్డి మధ్య పరిచయం మెల్లమెల్లగా ఫ్రెండ్‌షిప్‌గా మారింది. ఆ తర్వాత ఇద్దరు అభిరుచులు, మనసులు కలవడంతో ప్రేమగా మారింది. కొంతకాలం ఇద్దరు ఒకరిని మరోకరు అర్ధం చేసుకొన్న తర్వాత వారి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన భేటీ తర్వాత వారి పెళ్లికి అంగీకారం తెలిపారని జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనంలో పేర్కొన్నది.
అయితే శిరీష్, నయనికా వివాహాన్ని మార్చి 6 తేదీ 2026 సంవత్సరం రోజున జరుపడానికి ముహుర్తం నిర్ణయిచారు. ఇరు కుటుంబాలు, మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, సన్నిహితులు పాల్గొంటారు. అత్యంత నిరాడంబరంగా ఈ వివాహాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











