ప్రభాస్ సినిమాకు భారీ ఆఫర్: డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతోన్న బడా సంస్థ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చారిత్రక చిత్రాల దర్శకుడిగా పేరొందిన ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమా ద్వారా అతడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే ఈ చిత్రంపై అందరి దృష్టి పడింది. రామాయణం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్‌తో ఇది తెరకెక్కుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ క్రేజ్ నేపథ్యంతో 'ఆదిపురుష్' సినిమా హక్కుల కోసం ఇప్పటి నుంచే పోటీ నెలకొంది. పలు ఏరియాల రైట్స్ కోసం ఎన్నో సంస్థలు యూనిట్ ముందు భారీ ఆఫర్లను ఉంచుతున్నాయి. ఇక, ఈ మూవీ డిజిటల్ హక్కులకు కూడా ఇదే పోటీ ఉందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్' అన్ని భాషల డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ డీల్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇది దాదాపు రికార్డు స్థాయి డీల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ దీనిపై చర్చలు జరుపుతున్నట్లు బీ టౌన్‌లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది.

చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. సీతగా కృతీ సనన్, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నాడు. ఇక, ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే చిత్రీకరణను పున: ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











