నక్కతోక తొక్కిన సుహాస్.. హీరోగా మూడో సినిమా.. ఏకంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే!
కమెడియన్లు హీరోలుగా మారుతున్న దాఖలాలు చాలా చూస్తూనే ఉన్నాం. అయితే అలా మారిన వారు చాలా కాలం పాటు హీరోలుగా నిలదొక్కుకోవడం మాత్రం కష్టమే. ఈ మధ్య కాలంలో సునీల్ అలాంటి ప్రయత్నాలు చేసి విఫలమై మళ్ళీ కమెడియన్ పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఒక యువ కమెడియన్ మాత్రం వరుసగా హీరో అవకాశాలు దక్కించుకుంటూ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. ఆయన ఎవరో కాదు సుహాస్. సుహాస్ హీరో మూడో సినిమా ఈ రోజు అధికారికంగా హైదరాబాద్ ఫిలింనగర్ లో ప్రారంభమైంది. ఆ వివరాల్లోకి వెళితే

వరుస సినిమాలు
సుహాస్, అంటే నిన్న మొన్నటి దాకా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. నిజానికి దోచేయ్ అనే సినిమాతో 2015 లో టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన తరువాత 2019 లో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత మజిలీ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత మంచి పేరు రావడంతో డియర్ కామ్రేడ్, ప్రతి రోజు పండగే, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలలో కూడా మంచి పాత్రలు దక్కాయి.

కలర్ ఫోటో అనే సినిమా ద్వారా
ఇక ఆ తర్వాత 2020లో కలర్ ఫోటో అనే సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు సుహాస్. హీరోగా ప్రవేశం చేసిన తర్వాత కూడా కమెడియన్ పాత్రలు వచ్చినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆ పాత్రలు చేస్తూ హీరో పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు. అలా కలర్ ఫోటో రిలీజ్ అయిన తర్వాత రంగ్ దే, అర్థశతాబ్దం అనే రెండు సినిమాల్లో కూడా సుహాస్ కనిపించారు.

హీరోగా మూడో సినిమా
ఇక ఆయన హీరోగా రైటర్ పద్మభూషణ్ అనే సినిమా రూపొందుతుండగా ఇప్పుడు ఆయన హీరోగా రూపొందుతున్న మూడో సినిమా కూడా అధికారికంగా ప్రారంభమైంది. తెలుగులో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గా ఉన్న గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద ఈ సినిమా రూపొందుతోంది. ఇదే సినిమాను కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా సహా నిర్మిస్తున్నారు.

కొత్త దర్శకుడి దర్శకత్వంలో
అంటే గీతాఆర్ట్స్ బ్యానర్ అలాగే వెంకటేష్ మహా ఇద్దరూ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ పేరుతో రూపొందబోతున్న ఈ సినిమా ద్వారా దుష్యంత్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక ఈ టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచే విధంగా ఉన్నాయి..
నక్కతోక తొక్కి
ముందు నుంచి యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సుహాస్ సెలక్షన్ లో కూడా చాలా విభిన్నత పాటిస్తూ ఉండడంతో ఆయనకు వరుసగా మంచి మంచి అవకాశాలు దక్కుతున్నాయి. అలాగే హీరోగా కూడా ఆయన మంచి సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అయితే చేస్తున్న మూడో సినిమానే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తూ ఉండడంతో సుహాస్ ఎక్కడో నక్క తోక తోక ఇండస్ట్రీకి వచ్చాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











