బ్రేకింగ్... ఆసుపత్రిలో చేరిన మెగాస్టార్.. ప్రభాస్ కల్కి మరింత ఆలస్యం?
Amitabh Bachchan Hospitalised బాలీవుడ్ మెగా స్టార్, స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ఆయన అస్వస్థతకు గురైనట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మేరకు శుక్రవారం ఉదయం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. బిగ్‌బీ ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
80ఏళ్ల వయసులోనూ...
బాలీవుడ్ స్టార్ హీరో, మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయనకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటుల్లో అమితాబ్ బచ్చన్ ముందుంటారు. అయితే అభిమానులు ప్రేమగా బిగ్ బీ అని పిలుచుకుంటారు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో చలచచిత్రాల్లో నటించిన ఈ హీరో... 8 పదుల వయసులోనూ ఇంకా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు.

బిగ్ బి సంచలనం...
మరోవైపు టెలివిజన్ చరిత్రలో బిగ్ బి ఓ సంచనలం క్రియేట్ చేశారు కూడా. కౌన్ బనేగా కరోడ్ పతి షోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇక ఆ షో రీజినల్ భాషల్లో కూడా రూపొందించారు. బాలీవుడ్ లో ఆ మెగా స్టార్ హోస్టుగా నిర్వహిస్తే.. మన దగ్గర మన మెగాస్టార్ చిరంజీవి హోస్టుగా చేశారు. ఇక సామాజిక కార్యకర్తగా కూడా బిగ్ బీ ఎన్నో కార్యక్రమాల్లో సేవలు అందించారు. 81ఏళ్లు దాటినా.. కుర్ర హీరోలకు ఇప్పటికీ పోటీనిస్తూ.. తనదైన మార్కును చూపిస్తున్నారు.
ఫ్యాన్స్ కంగారు...
ఆ విషయం పక్కన పెడితే.. బిగ్ బీ ఫ్యాన్స్ తెగ కంగారు పడిపోతున్నారు. దానికి కారణం.. ఆయన ఆసుపత్రిలో చేరడం. బిగ్ బీ అమితాబ్ బచ్చాన్ ఆసుపత్రిలో చేరినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురికావడం వల్ల ఈ మేరకు శుక్రవారం ఉదయం ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో ఆయన చేరినట్లు తెలుస్తోంది. బిగ్ బీ ఆస్పత్రిలో చేరడానికి పూర్తి కారణాలు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

ఆ సమస్యతోనే....
ఇటీవల బిగ్ బి అమితాబ్ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్ట్ పెట్టారు. 'T 4950 ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా' అని ట్విట్టర్ లో రాసుకువచ్చారు. తన అనారోగ్యాన్ని ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియా సమాచారం మేరకు ఆయన ఈ రోజు ఉదయం కోకిలాబెన్ ఆస్పత్రిలో టైట్ సెక్యూరిటీ మధ్య అడ్మిట్ అయ్యారట. ఆయనకు యాంజియోప్లాస్టి సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. అంతే కాదు బిగ్ బీకి శ్వాస ఆడకపోవటంతో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారట.
మరింత ఆలస్యం...
ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ బాలీవుడ్ మీడిాయలో ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బిగ్ బీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ క్షేమంగా, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలిన భగవంతుడిని వేడుకుంటున్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం బిగ్ బీ కల్కి ఏడి 2898 సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ టైంలో ఆయన ఆసుపత్రిలో ఉంటే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోతే సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టెన్షన్ చెందుతున్నారు.

చెప్పిన డేట్ కే రిలీజ్ కానుందా...
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బిగ్ బీ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా దీపిక పదుకునే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే దీపిక పదుకునే ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు అమితాబ్ అనారోగ్యం.. మరి ఈ సినిమా మేకర్స్ చెప్పినట్లు మే 9కి రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











