అమరులైన వీర జవానుల కుటుంబాలకు అమితాబ్ 2.5 కోట్ల ఆర్థిక సాయం!
పుల్వామా ఉగ్ర దాడి ప్రతి భారతీయుడిలో ఆగ్రహావేశాలని రగిలిస్తోంది. ఇండియా ఎంతగా శాంతి మాత్రం జపించినా పాకిస్తాన్ కుట్రలతో, ఉగ్ర దాడులతో రెచ్చిపోతోంది. పుల్వామా ఘటనతో 49మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం రోజు జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంట్లో పాక్ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడుల జరిగిపిన సంగతి తెలిసిందే. దేశం మొత్తంఉగ్రవాదుల పైశాచికత్వాన్ని, పాక్ చర్యలని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.

తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల కుటుంబాలని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ప్రాణాలు కోల్పోయిన జవానులు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు అమితాబ్ తెలిపారు. అంటే అమితాబ్ డొనేట్ చేయబోతున్న మొత్తం 2.5 కోట్లు. టాలీవుడ్ నుంచి యువ హీరో విజయ్ దేవరకొండ కూడా వీరజవానుల కుటుంబాలని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు పాక్ ని బ్యాన్ చేయడం ప్రారంభించారు. ఉగ్ర ఘటనకు నిరసనగా పాక్ లో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సిన బాలీవుడ్ ప్రముఖులు వారి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ప్రముఖ నటి షబానా అజ్మీ కరాచీలో జరిగే ఓ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. కానీ తాను పాక్ కి వెళ్లనని తన నిరసన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











