twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మాస్క్‌కు పూర్తి అర్దం వివరించిన అమితాబ్.. ఝలక్ ఇచ్చిన నెటిజన్

    |

    దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అయింది. మాస్క్ లేకుండా ప్రజలను చూడలేమంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమితాబ్ తన ముఖానికి మాస్క్ ధరించి సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఇటీవల రిలీజైన గులాబో సితాబో సినిమాకు సంబంధించిన మాస్క్‌తో కనిపించారు. మాస్క్ అంటే పూర్తి అర్ధం ఇదే అంటూ నెటిజన్లకు ఆసక్తికరమైన విషయం చెబితే ఓ నెటిజన్ ఆయన అందించిన సమాచారానికి ఓ ప్రశ్నను సంధించి ఝలక్ ఇచ్చారు.

    అయితే మాస్క్ గురించి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో.. దొరికింది.. దొరికింది.. దొరికిపోయింది. చాలాసేపు శ్రమించిన తర్వాత హిందీలో మాస్క్ అనువాదం లభించింది. మాస్క్ అంటే నాసికాముఖ్ సంరక్షక్ కీటా అనురోధక్ వాయుచనక్ వస్త్ర్ దొరియుక్త్ పట్టిక అంటూ తనదైన శైలిలో విపులీకరించారు.

    Amitabh Bachchan Elobrated Hindi word for mask.

    అయితే మాస్క్‌కు అర్ధం చెప్పిన తర్వాత ఓ నెటిజన్ అమాయకంగా.. సర్.. ఇది కౌన్ బనేగా కరోడ్‌పతిలో ప్రశ్నగా వస్తుందా? అని అడగడంతో బిగ్ బీ నోట మరో మాట రాకపోవడం గమనార్హం.

    ఇదిలా ఉండగా, దర్శకుడు షుజిత్ సర్కార్ రూపొందించిన గులాబో సితాబో సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించారు. ఇటీవలే ఆ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై నేరుగా రిలీజైంది. కాగా, త్వరలోనే అమితాబ్ కేబీసీ 12వ సీజన్ ద్వారా ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు.

    English summary
    Bollywood super star Amitabh Bachchan reveals hindi meaning of Mask. He writes in his instagram that Found it! Found it! Found it! After a lot of effort, I found the Hindi term for mask). After a lot of hard work by Ef Vb, he did the translation of 'MASK', in Hindi: nasikamukhsanrakshak keetaanurodhak vayuchanak vastrdoriyuktpattika.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X