Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మాస్క్‌కు పూర్తి అర్దం వివరించిన అమితాబ్.. ఝలక్ ఇచ్చిన నెటిజన్
దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అయింది. మాస్క్ లేకుండా ప్రజలను చూడలేమంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమితాబ్ తన ముఖానికి మాస్క్ ధరించి సోషల్ మీడియాలో దర్శనమిచ్చారు. ఇటీవల రిలీజైన గులాబో సితాబో సినిమాకు సంబంధించిన మాస్క్‌తో కనిపించారు. మాస్క్ అంటే పూర్తి అర్ధం ఇదే అంటూ నెటిజన్లకు ఆసక్తికరమైన విషయం చెబితే ఓ నెటిజన్ ఆయన అందించిన సమాచారానికి ఓ ప్రశ్నను సంధించి ఝలక్ ఇచ్చారు.
అయితే మాస్క్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో.. దొరికింది.. దొరికింది.. దొరికిపోయింది. చాలాసేపు శ్రమించిన తర్వాత హిందీలో మాస్క్ అనువాదం లభించింది. మాస్క్ అంటే నాసికాముఖ్ సంరక్షక్ కీటా అనురోధక్ వాయుచనక్ వస్త్ర్ దొరియుక్త్ పట్టిక అంటూ తనదైన శైలిలో విపులీకరించారు.
అయితే మాస్క్‌కు అర్ధం చెప్పిన తర్వాత ఓ నెటిజన్ అమాయకంగా.. సర్.. ఇది కౌన్ బనేగా కరోడ్‌పతిలో ప్రశ్నగా వస్తుందా? అని అడగడంతో బిగ్ బీ నోట మరో మాట రాకపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా, దర్శకుడు షుజిత్ సర్కార్ రూపొందించిన గులాబో సితాబో సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించారు. ఇటీవలే ఆ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫాంపై నేరుగా రిలీజైంది. కాగా, త్వరలోనే అమితాబ్ కేబీసీ 12వ సీజన్ ద్వారా ప్రేక్షకులకు ముందుకు వస్తున్నారు.