ఇండియన్ ఆర్మీపై సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ ట్వీట్.. అమితాబ్ రిప్లై!
మెగా మేనల్లుడు సాయిధరమ్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా చేసిన ఓ ట్వీట్ అందరిని ఆకట్టుకుంటోంది. చివరకు బిగ్ బి అమితాబ్ కూడా తేజు ట్వీట్ కి ఫిదా అయ్యారు. ఇంతకీ సాయిధరమ్ తేజ్ చేసిన ట్వీట్ ఏంటంటే.. ఇండియన్ ఆర్మీకి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు. చాలామంది ప్రేమికుల దినోత్సవం రోజు సింగిల్ గా ఉండడం పట్ల కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.

కానీ బోర్డర్ లో సింగల్ గా ఉంటూ దేశం కోసం కాపు కాచే సైనికుల్ని మాత్రం చాలా తక్కువ మంది గుర్తు పెట్టుకుంటారు. సైనికులు ప్రతికూలమైన వాతావరణంలో సింగిల్ గా, కుటుంబాలకు, స్నేహితులకు దూరంగా ఉంటూ దేశం కోసం పోరాడతారు. మనం వారి పక్షాన నిలవాల్సిన అవసరం ఉంది. త్యాగాలకు సిద్దమైన మన జవానులకు ప్రేమ పంచండి.
మీరు ఒంటరి కాదు.. మేము మీతో ఉన్నాము.. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అంటూ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు ఫిదా అయినా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సెల్యూట్ అంటూ సాయిధరమ్ తేజ్ కు రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రలహరి చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











