Breaking: Project K షూటింగులో అమితాబ్‌కు ప్రమాదం. బిగ్‌బీకి తీవ్రగాయాలు కావడంతో.. !

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్ K చిత్రం షూటింగ్‌లో అపశృతి చోటు చేసుకొన్నది. భారతీయ సినీ దిగ్గజం, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్రంగా గాయపడ్డారు. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగిన వెంటనే బిగ్ బీని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన అమితాబ్‌కు చికిత్స అందించి.. కొద్ది రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు వెల్లడించినట్టు సమాచారం. ఈ ప్రమాదం వివరాల్లోకి వెళితే..

అమితాబ్‌పై యాక్షన్ సీన్లు

అమితాబ్‌పై యాక్షన్ సీన్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ K చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొద్దికాలంగా అమితాబ్ బచ్చన్‌పై కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సీన్లను కూడా షూట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దీపిక పదుకోన్ కూడా షూట్‌లో భాగం పంచుకొంటున్నారు.

అమితాబ్‌ ప్రమాదానికి గురికావడంతో

అమితాబ్‌ ప్రమాదానికి గురికావడంతో

Project K సినిమా యాక్షన్ షూట్‌లో అమితాబ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు వైద్యులు సీటీ స్కాన్, ఇతర పరీక్షలు నిర్వహించారు. కుడి పక్కటెముకల్లో ఫాక్చర్ అయిందనే విషయం పరీక్షల్లో తేలింది. దాంతో ఆయనకు తగిన చికిత్స అందించిన అనంతరం విశ్రాంతి అవసరం కావడంతో ఆయన ముంబైకి వెళ్లిపోయారు అని టీమ్ తెలియజేసింది.

పక్క టెముకులు విరిగాయి..

పక్క టెముకులు విరిగాయి..

అయితే తనకు గాయమైన విషయాన్ని అమితాబ్ స్వయంగా వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో వెల్లడిస్తూ.. ఇటీవల చిత్రీకరించిన యాక్షన్ సీన్ల సందర్భంగా తనకు గాయమైంది. నేను తీవ్రంగా గాయపడ్డాను. పక్క టెముకలు విరిగిపోయాయి. కుడి పక్కటెముక భాగంలో కండరాలు చీలిపోయాయి. దాంతో షూట్ క్యాన్సిల్ చేశాం అని అమితాబ్ చెప్పారు.

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది అంటూ

శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది అంటూ

వైద్యులు పరీక్షలు జరిపిన తర్వాత విశ్రాంతి అవసరం కావడంతో నేను హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకొన్నాను. స్ట్రాపింగ్ చేసి కట్టుకట్టారు. నొప్పి తీవ్రంగా ఉంది. నొప్పి కారణంగా బాధ ఎక్కువగానే ఉంది. కదలడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. నొప్పి తగ్గడానికి మందులు తీసుకొంటున్నాను. గాయాల నుంచి తేరుకోవడానికి కొన్నివారాలపాటు పడుతుందని వైద్యులు తెలిపారు.

పరామర్శకు ఎవరూ రావొద్దని బిగ్ బి రిక్వెస్ట్

పరామర్శకు ఎవరూ రావొద్దని బిగ్ బి రిక్వెస్ట్

హైదరాబాద్ నుంచి ముంబైలోని నా జల్సా నివాసంలో విశ్రాంతి తీసుకొంటున్నాను. అత్యవసర పనుల కోసం లేచి తిరుగుతున్నాను. నొప్పి, విశ్రాంతి కారణంగా నేను బెడ్‌కే పరిమితమయ్యాను. దయచేసి నన్ను పరామర్శించేందుకు ఎవరూ రాకూడదు. నేను ఎవరిని కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి నా ప్రైవసీకి ఎవరూ భంగం వాటిల్లేలా చేయవద్దు అని అమితాబ్ తన సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X