అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్
బాలీవుడ్ సినీ దిగ్జజం అమితాబ్ బచ్చన్‌కు మరోసారి సర్జరీ జరుగనున్నది. ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండకపోవడం వల్ల సర్జరీ చేయాలని వైద్యుల బృందం అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. సర్జరీ జరుగనున్న నేపథ్యంలో తాను బ్లాగ్‌లో సమాచారం ఇవ్వలేకపోయాను అంటూ వెల్లడించారు.
అయితే బిగ్‌బీ సర్జరీ జరుగున్నదనే వార్త నేపథ్యంలో అభిమానులు అమితాబ్ కోసం ప్రార్థనలు చేశారు. త్వరలోనే ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకొంటున్నారు.

గతంలో కూలీ షూటింగు సమయంలో యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు.
సర్జరీ తర్వాత వెంటనే వికాస్ బెహల్ సినిమా షూటింగులో పాల్గొంటానని తెలిపారు. ప్రస్తుతం దర్శకుడు నాగరాజ్ పోపట్‌రావు మంజులే దర్శకత్వంలో జుండ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే చహ్రే అనే చిత్రంలో కూడా నటించాడు. చహ్రే ఏప్రిల్ 30న, జుండ్ జూన్ 18 తేదీన రిలీజ్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











