అన్నయ్య ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు... ఆఫర్ రాకపోతే ఎంత బాధపడ్డడో.. ఆనంద్ దేవరకొండ
Recommended Video
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధురా ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినమాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొరసాని. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని యు/ఎ సర్టిఫికేట్ ని పొందింది. కె.వి.ఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్న దొరసాని చిత్రం ఈ నెల 12న రిలీజ్ కి సిద్దమవుతున్నసందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మీడియాతోముచ్చటించారు.

అన్నయ్య సినిమా
అన్నయ్య సినిమా పరిశ్రమలో స్థిరపడటానికి చాలా స్టగుల్స్ చూసాడు. ఆఫర్ల కోసం ఎన్ని ఆఫీసులు తిరిగాడో నాకు తెలుసు. కానీ అన్నకు వచ్చిన సక్సెస్ నాలో ధైర్యాన్ని నింపింది. టాలెంట్ ఉంటే సక్సెస్ అవ్వొచ్చు అనే నమ్మకం కలిగింది. కానీ నా ప్రతిభే నన్ను నిలబెడుతుందని నాకు తెలుసు. ఒక బ్రదర్ సపోర్ట్ నాకు ఎప్పుడూ తన దగ్గర ఉంటుంది. కానీ స్టార్ కాకుండా అన్నతో పోలికలన్నీ సినిమా తర్వాత పోతాయి అని నమ్ముతున్నాను అని ఆనంద్ దేవరకొండ అన్నారు.

ఇంట్లో అందరం ప్రాక్టికల్‌గా ఉంటాం
ఇంట్లో అందరం ప్రాక్టికల్‌గా ఉంటాం. ఎక్కువగా ఎమోషనల్ కనిపించడు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలా భావోద్వేగానికి గురికావడం తట్టుకోలేకపోయాను. కానీ అన్న నా గురించి మాట్లాడుతుంటే ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే తమ్ముడ్ని చూసుకోవాలని అన్నకు ఉంటుంది. కానీ నా కష్టం నేను పడాలి, నా కథ నేను వెతుక్కొవాలని అన్న అనుకున్నాడు. కాబట్టే నాకు సపోర్ట్ ఇవ్వలేదని తెలుసు అని ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడు.

ప్రీరిలీజ్ స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను
ప్రీరిలీజ్ స్టేజ్ మీద అలా మాట్లాడుతుంటే నేను అన్నలాగే ఫీల్ అయ్యాను. సుమారు పదేళ్ళు కష్టమైన ప్రయాణం అన్నయ్యది. ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అన్నతోపాటు ఓ సారి ఆడిషన్స్‌కి వెళ్ళాను. అప్పుడు సెలెక్ట్ అవ్వకపోతే ఆ రోజు అన్నయ్య ఎంత బాధ పడ్డాడో నేను దగ్గర నుంచి చూసాను. నాన్న సీరియల్స్
డైరెక్ట్ చేసేవారు, ఇంట్లో రోజూ సినిమా గురించి డిస్కషన్స్ ఉండేవి అని ఆనంద్ తన అనుభవాలను పంచుకొన్నాడు.

దొరసాని సినిమా చూసే ముందు అన్నయ్య చాలా టెన్షన్ పడ్డాడు
దొరసాని సినిమా చూసే ముందు అన్నయ్య చాలా టెన్షన్ పడ్డాడు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా ఆనంద పడ్డాడు. సినిమా చూసిన తర్వాత నాకు అన్న ఇచ్చిన ఎనర్జీ నాలో
కాన్ఫిడెన్స్‌ను నింపింది. అన్నయ్యను చూసిన తర్వాత నాకు నమ్మకం పెరిగింది. శివాత్మిక, దర్శకుడు మేమంతా ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. దానికి ఫలితం జూలై 12న మాకు తప్పకుండా లభిస్తుంది అని ఆనంద్ చెప్పాడు.

నటీనటులు, సాంకేతిక వర్గం
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా' శరణ్య
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
ఆర్ట్ డైరెక్టర్: జెకె మూర్తి
కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని
నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కేవీఆర్. మహేంద్ర


Click it and Unblock the Notifications











