Anand Devarakonda: సినిమా ఆఫర్ వచ్చింది అంటే .. విజయ్ నవ్వాడు.. కానీ ఈరోజు మాత్రం..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్.కె.ఎన్. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం అయితే యువతను బాగా ఆకట్టుకుంటుంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సోమవారం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రౌడి బాయ్ విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఇక ఈ వేడుకలో ఆనంద్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...
ఆనంద్ దేవరకొండ కామెంట్స్...:ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా.. రోజురోజుకు మౌత్ టాక్ తో దూసుకువెళ్తోంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుని.. లాభాల్లో బేబీ సినిమా ముందుకువెళ్తోంది. ముఖ్యంగా నేటి యువతను ఈ సినిమా బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. బేబీ సినిమా సక్సెస్ మీట్ ను సోమవారం చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఇక ఈ వేడుకకు రౌడి బాయ్ విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆనంద్ దేవరకొండ ఈ వేడుకలో తన అన్న గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.
ప్రేక్షకులకు ఆనంద్ థ్యాంక్స్...:ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ... నాకు 3, 4 రోజుల నుంచి ఏం అర్థం కావడం లేదు. అసలు మన సినిమా రిలీజ్ అయిందా అనే విషయం కూడా అర్థం కావట్లే. ఇంత సక్సెస్ అవుతుందని నేను అసలు ఊహించలేదు. మేం నిన్న సంధ్య సింగిల్ స్క్రీన్ కు వెళ్తే... ఆ జనాలను చూసి షాక్ అయ్యాను. మేం అంతగా ఫేమ్ కాకపోయినా.. అందరూ గుర్తుపడుతున్నారు. మీరు కంటెంట్ నమ్మి... ఈ సినిమాను సక్సెస్ చేశారు.. చాలా చాలా థ్యాంక్స్.

ఈ సినిమాకు ఫస్ట్ హీరో ఆయనే...:నాకు వేల మెసెజస్ వస్తున్నాయి.... అన్న ఏడ్పించావ్ అంటూ వస్తున్నాయి. నేను ఒక్కటే ప్రామిస్ చేయగలను. ఇకపై నేను మంచి సినిమాలు తీసుకువస్తాను. మీరు థియేటర్లలో కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు చేస్తాను. మా టీం 3 ఏళ్లుగా కష్టపడి ఈ సినిమా తీశారు. అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం అయితే సూపర్. ఈ సినిమాకు ఫస్ట్ హీరో విజయ్ బుల్గానిన్. ఆ మ్యూజిక్ వింటుంటే.. గుండె బరువెక్కుతుంది.. దానికి కారణం విజయ్ బుల్గానిన్.

రాజేశ్ మీరు మారొద్దు...:విరాజ్ చాక్లెట్ బాయ్... మస్తు చేశావ్. విరాజ్ యాక్టింగ్ చేస్తుంటే.. కమల్ హాసన్ అని అరుస్తున్నారు. వైష్ణవి కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ సినిమాకు వర్సటైల్ క్యారెక్టర్ చేసింది. ఎస్.కె.ఎన్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఇచ్చారు. సినిమా నడవకపోతే సినిమాలు వదిలేస్త అని అనుకుంటున్నా... ఇక ఈ సినిమా మంచి హోప్ ను ఇచ్చింది. దర్శకుడు రాజేశ్ రాసిన డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. రూల్స్ బ్రేక్ చేసి ఈ సినిమా చేశాడు. ఎవరు ఏం అన్న గానీ మీరు మారొద్దు. ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండండి.

సినిమా చేస్తా అంటే నవ్వాడు...:ఇక మా అన్న గురించి వస్తే... మేం దొస్తులు లెక్క ఉంటాం. 2019లో విజయ్ నాకు ఒక సినిమా వచ్చింది.. తీసుకుంటున్న అంటే విజయ్ నవ్వాడు. నేను ఏదో ప్రంక్ చేస్తున్నా అనుకున్నాడు. తర్వాత నిజంగానా అని అడిగాడు.. అవును నిజమే అంటే.. సినిమాలు అంటే జోక్ అనుకుంటున్నావా.. సరే నిన్ను ఆపలేము.. చేయ్.. అని ప్రొత్సహించాడు. ఇక నాకు కూడా మస్తు భయం ఉండే.. అన్న పేరును చెడగొడతానా అని భయపడ్డా.. అందుకే మీకు కూడా ప్రామిస్ చేస్తున్నా.. మంచి సినిమాలు చేస్తా.. అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











