డ్యాన్స్ తో అదరగొట్టిన ఆనంద్ దేవరకొండ
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకోవాలని కష్టపడుతున్న ఆనంద్ దేవరకొండ రెండవ సినిమాతోనే ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. మొదటి సినిమా దొరసానితో ఒక వినూత్నమైన ప్రయోగంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక రెండవ సినిమా డిజిటల్ మీడియాలో సూపర్ హిట్ గా నిలిచింది.
పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడిస్ అన్ని వర్గాల ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక నెక్స్ట్ మరోక సినిమాతో తన టాలెంట్ చూపించాలని అనుకుంటున్న ఆనంద్ అన్ని రకాలుగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ 'పుష్పక విమానం' సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలోని సిలకా అనే పాటకు స్టెప్పులు వేసి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాడు.

ఇంతవరకు ఈ హీరోకు డ్యాన్స్ స్కిల్ చూపించే అవకాశం రాలేదు. ఇప్పుడు కమర్షియల్ హీరోల స్టైల్ లో డ్యాన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు హింట్ ఇచ్చేశాడు. కొరియోగ్రాఫర్ తో కలిసి అద్భుతమైన స్టెప్పులు వేసి తన స్కిల్ చూపించిన ఆనంద్ రానున్న రోజుల్లో ఇంకా ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. కొత్త దర్శకుడు దామోదర దర్శకత్వం వహించిన పుష్పక విమానం కామెడీ ఇంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. సినిమాలో గీత సైని, శాన్వి మేఘన హీరోయిన్స్ గా నటించగా విజయ్ దేవరకొండ హోమ్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు.


Click it and Unblock the Notifications











