అందుకే శివాత్మికకు దూరంగా ఉన్నా.. అలాంటి ఫీలింగ్ కలుగొద్దని.. ఆనంద్ దేవరకొండ

Recommended Video

Anand Devarakonda Interesting Comments On Shivatmika | Dorasani || Filmibeat Telugu

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ మ‌ధురా ఎంట‌ర్ టైన్మెంట్, బిగ్ బెన్ సిన‌మాలు సంయుక్తంగా నిర్మించిన సినిమా దొర‌సాని. ఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను
పూర్తిచేసుకొని యు/ఎ స‌ర్టిఫికేట్ ని పొందింది. కె.వి.ఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న దొర‌సాని చిత్రం ఈ నెల 12న రిలీజ్ కి సిద్ద‌మ‌వుతున్న‌సంద‌ర్భంగా హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మీడియాతో
ముచ్చ‌టించారు.

వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే కథతో

వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే కథతో

దొర‌సాని పిరియాడిక్ ల‌వ్ స్టోరీ, రాజు, దొర‌సాని మ‌ధ్య జ‌రిగిన
ప్రేమ‌క‌థ‌. నిజ‌ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రేమ‌క‌థ‌. క‌థ‌లోని
స్వ‌చ్ఛ‌త‌, నిజాయితీ ఈ ప్రేమ‌క‌థ‌ను ముందుకు న‌డిపిస్తాయి. అన్నీ రియ‌ల్
లోకేష‌న్స్‌లో షూటింగ్ చేసాం. దర్శకుడు కేవీఆర్ మహేంద్ర సుమారు 5 గంట‌లు క‌థ చెప్పాడు. ఆ క‌థ‌ను చెప్పిన
తీరులోనే నాకు అర్దం అయ్యింది. ప్ర‌తీ పాత్ర రియ‌ల్‌గా ఉంటుంది.
క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్, సిద్ధిపేటలో రియ‌ల్, కోదాడ ద‌గ్గ‌ర‌లోని గ‌డిలో
ఎక్కువ రోజులు షూట్ చేసాం.
ఆ క‌థ‌లోని ఆత్మ‌ను తెర‌మీద‌కు తెచ్చే
ప్ర‌య‌త్నం చేసాం. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర ఎక్క‌డా ఫేక్ ఎమోష‌న్స్‌ను
రానీయ‌లేదు. క‌థ‌ను ద‌ర్శ‌కుడు ట్రీట్ చేసిన విధానం చాలా రియ‌లిస్టిక్ గా
ఉంటుంది.

 అర్జున్ రెడ్డి తర్వాతే నాకు ఆఫర్లు

అర్జున్ రెడ్డి తర్వాతే నాకు ఆఫర్లు

అన్న‌య్య (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) అర్జున్ రెడ్డి త‌ర్వాత కొన్ని ఆఫ‌ర్స్
వ‌చ్చాయి. కానీ అప్పుడు సీరియ‌స్‌గా తీసుకొలేదు. అన్న‌య్య
బిజినెస్‌ని స‌పోర్ట్ చేద్దామ‌ని ఇండియాకి వ‌చ్చాను . యూఎస్‌కు వెళ్ళ‌కు ముందు
థియేట‌ర్‌లో శిక్షణ పొందాను. యాక్టింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఉంది కానీ సినిమా ఎక్స్
పీరియ‌న్స్ లేదు. ఆ సమయంలో ద‌ర్శ‌కుడు మ‌హేంద్రను కలిసిన తర్వాత సినిమా మీద
ఉన్న భ‌యాలు పోయాయి. దొరసాని సినిమా చూసే ముందు నా గురించి అన్నయ్య టెన్ష‌న్ ప‌డ్డాడు. కానీ సినిమా చూసిన త‌ర్వాత
చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఆ త‌ర్వాత నాకు అన్న ఇచ్చిన ఎన‌ర్జీ
నా కాన్ఫిడెన్స్‌ను పెంచింది.

 విజయ్ దేవరకొండ తమ్ముడిగా నాకు

విజయ్ దేవరకొండ తమ్ముడిగా నాకు

విజ‌య్ దేవ‌రకొండ త‌మ్ముడిగా ఇండస్ట్రీతో పరిచయం ఉంది. ఈ క‌థ కోసం ఆర్టిస్ట్ల‌ను వెతుకుతున్న‌ప్పుడు న‌న్ను

ట్రై చేద్దాం అనుకున్నారు. నేను, శివాత్మిక ఆడిష‌న్స్ చేసాం. ఆ
క్యారెక్ట‌ర్స్ కి ఫిట్ అవుతామని న‌మ్మ‌కం ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు
వ‌చ్చాకే మేము ప్రాజెక్ట్ లోకి వ‌చ్చాం.

సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య చనువు ఉండదు. అందుకే శివాత్మికకు దూరంగా ఉన్నాను. మేము కలిస్తే చనువు ఏర్పడి.. స్క్రీన్ మీద ఫీలింగ్ దెబ్బ తింటుందనే ఉద్దేశంతో వర్క్ షాప్స్ కూడా వేర్వేరుగా చేశాం. సినిమా సెట్లో కూడా దూరంగా ఉన్నాం. ఇప్పుడు మా మధ్య ఫ్రెండ్ షిప్ పెరిగింది అని ఆనంద్ దేవరకొండ అన్నారు.

 నేను ట్రోల్స్ పట్టించుకోను

నేను ట్రోల్స్ పట్టించుకోను

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్స్‌ను సీరియ‌స్‌గా తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నా న‌ట‌న మీద వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను తీసుకుంటాను. సినిమాపైపూర్తిగా న‌మ్మ‌కం ఉంది. దొరసాని సినిమా స్వచ్ఛమైన ప్రేమ‌క‌థ. యాక్ష‌న్, కోపాలుద్వేషాలు అలాంటివి ఏమీఉండ‌వు. లిప్‌లాక్‌లు అంత ఇపార్టెంట్ కావు. మా ప్రేమ‌క‌థ‌లో చాలా ట‌ర్న్స్ ఉంటాయి. మా ప్రేమ‌ను మీరు ఫీల్ అవుతారు. ద‌ర్శ‌కుడు మ‌హేంద్ర గ్రేట్ స్టోరీ టెల్ల‌ర్. మా క‌థ‌లోని అన్ని క్యారెక్ట‌ర్ మీద అత‌నికి పూర్తి క్లారిటీ ఉంది. అత‌ని మంచి ద‌ర్శ‌కుడిగా నిల‌బ‌డ‌తాడు అని ఆనంద్ దేవరకొండ తెలిపారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా' శరణ్య

సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

ఆర్ట్ డైరెక్టర్: జెకె మూర్తి

కో ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని

నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని

రచన, దర్శకత్వం : కేవీఆర్. మహేంద్ర

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X