‘పుష్పక విమానం’ ప్రమోషన్స్.. ఊపులో ఉన్న ఆనంద్ దేవరకొండ
యంగ్ సెన్సేషన్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రం దొరసానితో మంచి నటుడిగా గుర్తింపు సాధించాడు.కానీ ఆ మూవీ కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అలా రెండో చిత్రంతో మరో సారి ప్రయోగం చేశాడు ఆనంద్. మిడిల్ క్లాస్ మెలోడిస్ అనే మూవీతో అందరినీ ఆకట్టుకున్నాడు. మొత్తానికి రెండో ప్రయత్నంతో ఆశించిన విజయాన్ని అందుకున్నాడు.
అయితే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ ఓటీటీకే పరిమితమైంది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అందరినీ ఆకట్టుకుంది. మొదటిసారి సక్సెస్ చవిచూడటంతో తన తదుపరి చిత్రాన్ని త్వరగానే పట్టాలెక్కించాడు. ఈ మధ్యే వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. పుష్పక విమానం అంటూ డిఫరెంట్ టైటిల్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ భారీ స్థాయిలోనే చేస్తోన్నట్టున్నారు.

తాజాగా మరో పోస్టర్‌ను వదిలింది చిత్రయూనిట్. చిట్టిలంక సుందర్ వివాహ వేడుకలో చమన్ బ్రదర్స్ వారి గాన కచేరి అంటూ వెరైటీ ప్రమోషన్స్ చేపట్టారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందంటూ ఇలా వెరైటీగా చెప్పుకొచ్చారు. ఈ చిత్రం నుంచి చిలకా అనే మొదటి పాట మార్చి 15 న 11:07 గంటలకు విడుదల కాబోతోందని ప్రకటించారు. మొత్తానికి ఈ మూవీని వెరైటీ పద్దతుల్లో ప్రమోట్ చేస్తూ అందరినీ కట్టి పడేస్తున్నారు.


Click it and Unblock the Notifications











