ఆ రోజు ఏడ్చేశా, వాళ్లకు చెప్పినా అర్థం కాదు: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ భావోద్వేగం
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అతడు రాజు అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 1980 నాటి బ్యాక్ డ్రాప్‌లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక నటిస్తుంది. తాజాగా 'దొరసాని' చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయింది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆక్టుకుంది.

నాలుగేళ్ల క్రితం నేను యూఎస్ఏలో ఉన్నా
నాలుగేళ్ల క్రితం నేను యూఎస్ఏలో ఉన్నా. మాస్టర్స్ అయిపోయింది. జాబ్ చేస్తున్నా. ఒక రోజు ఆఫీసుకు వెళ్లకుండా రూములో కూర్చుని ల్యాప్ టాప్ ఓపెన్ చేసి ‘పెళ్లి చూపులు' ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ రోజు విజయ్ ఇలాగే స్టేజీ మీద ఉండి మాట్లాడటం చూశాను. అది విన్న తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాను. అన్నయ్య హార్డ్ వర్క్ చేస్తూ 10 ఏళ్ల నుంచి థియేటర్ చేస్తుండగా ఒక సోలో ఫిల్మ్ ఆఫర్ రావడం, అది సక్సెస్ అవ్వడం మామూలు విషయం కాదు.

రూములో కూర్చుని ఏడ్చేశా, వాళ్లకు చెప్పినా అర్థం కాదు
ఆ రోజు అన్న స్పీచ్ చూసినపుడు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలయ్యాను. నాకు కళ్లలో నుంచి నీళ్లు వచ్చాయి. రూములో ఒక్కడినే ఉండి భావోద్వేగంతో ఏడ్చేశాను. ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవడానికి అపుడు తెలుగు వారు ఎవరూ లేరు. బాంబే వాళ్లు, అమెరికా వాళ్లు ఉండేవారు. తెలుగు సినిమా అంటే మనకు ఎంత పిచ్చి ఉంటుందో వాళ్లకు చెప్పినా అర్థం కాదు అర్థం కాదు.

నేను విజయ్ తమ్ముడిని కాబట్టి ఇదంతా ప్లాన్ చేసి చేయలేదు
ఈ రోజు నాకు ఎంతో స్పెషల్... ‘దొరసాని' ట్రైలర్ లాంచ్‌తో పాటు మా పేరెంట్స్ వెడ్డింగ్ డే. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్టెన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మిస్తున్నాయి. 2016లో పెళ్లి చూపులు చిత్రాన్ని ఈ మూడు బేనర్లు ఎంత సపోర్ట్ చేశాయో... ‘దొరసాని' చిత్రాన్ని అంతే సపోర్ట్ చేశాయి. విజయ్ దేవరకొండ తమ్ముడు కాబట్టి ఇదంతా ప్లాన్ చేసి చేశారని మీరు అనుకోవచ్చు. కానీ అలా జరుగలేదు.

ఆయన వల్లే ఈ సినిమా మొదలైంది
ఈ సినిమా మొదలవ్వడానికి కారణం మహేంద్ర అన్న. ఆయన ఒక బ్రిలియంట్ డైరెక్టర్, జీనియస్ స్టోరీ టెల్లర్. ఇవన్నీ మీకు జులై 12న సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇది స్పెషల్ సినిమా ఎందుకు అంటే అందరూ కొత్తవారితో చేసిన సినిమా. ఈ చిత్రానికి అద్భుతమైన టెక్నీషియన్లు పని చేశారు. మాకు అన్ని కలిసి రావడంతో సినిమా అద్భుతంగా వచ్చింది.

తోపులాగా వెళ్లి జాబ్ రిజైన్ చేశాను
శివాత్మిక ఇంటర్మీడియట్ పూర్తి చేసి నెక్ట్స్ స్టెప్ ఏమిటని ఎదురు చూస్తోంది. నేనేమో లైఫ్‌లో ఒక లక్ష్యం అంటూ లేకుండా... తోపులాగ ఒక రోజు వెళ్లి జాబ్ రిజైన్ చేశాను. ఆ తర్వత ఏం చేయాలో తెలియదు. మాలాంటి కొత్తవారిని తీసుకుని స్పెషల్ ఫిల్మ్ తీయడం అనేది డిటర్మినేషన్ ఉన్న మనిషి మాత్రమే చేయగలడు. ఈ సినిమాను సినిమాలా చూడండి. మమ్మల్ని యాక్టెప్ట్ చేయండి అని అడగటం లేదు. మీకు ట్రైలర్ నచ్చితే జులై 12న సినిమా చూడండి.


Click it and Unblock the Notifications











