twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpaka Vimanam నాన్న, అన్నయ్య లేకపోతే నేను లేను.. ఆనంద్ దేవరకొండ ఎమోషనల్

    |

    యువ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం". గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్‌గా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది "పుష్పక విమానం". తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం విశాఖ గోకుల్ పార్క్ లో విజయ్, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్, స్థానిక సినీ ప్రియుల కేరింతల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా..

     Anand Deverakonda emotional

    హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ...నేను హీరోగా ఇవాళ మీ ముందు ఉన్నానంటే కారణం అన్నయ్య, నాన్న. అన్నయ్య విజయ్ ఎంతో కష్టపడి స్టార్ హీరో అయ్యాడు. ఆయన వేసిన దారిలో నేను ఈజీగా నడుచుకుంటూ మీ ముందుకు వచ్చాను. కానీ విజయ్ ఎప్పుడూ నాకు సొంతంగా ఎదగమనే చెబుతుంటాడు. ఆ మాట ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని నేను చేసిన చిత్రమిది అని అన్నారు.

    రెగ్యులర్ హీరో క్యారెక్టర్ లా ఈ చిత్రంలో నా పాత్ర ఉండదు. సహజంగా మీ చుట్టూ కనిపించే ఒక పాత్ర చిట్టిలంక సుందర్ ది. పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే అతని భార్య లేచిపోతుంది. ఎందుకు అనేది థియేటర్ లో చూడండి. ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అన్ని అంశాలు పుష్పక విమానం చిత్రంలో ఉంటాయి. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూపు దృష్టి మరల్చకుండా సినిమా చూస్తారు. పుష్పక విమానం గురించి మీరు ఎదురుచూస్తున్నారని తెలుసు. నవంబర్ 12న థియేటర్లలో కలుద్దాం అని ఆనంద్ దేవరకొండ అన్నారు.

    దర్శకుడు దామోదర మాట్లాడుతూ...పుష్పక విమానం సాంకేతికంగా, ఆర్టిస్టుల ప్రతిభపరంగా బలమైన సినిమా. హీరో క్యారెక్టర్‌ను ఎంజాయ్ చేయాలంటే మా చిత్రానికి రండి. ఆనంద్ అంత బాగా నటించాడు. ఈ చిత్రంలో టెక్నీషియన్స్, నటీనటులు కథను ఎంతగా ఓన్ చేసుకున్నారంటే, ఇలా బాగుంటుంది అంటూ నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. పుష్పక విమానం చూశాక విజయ్ లాగే ఆనంద్ కు కూడా లేడీ ఫ్యాన్స్ పెరుగుతారు అని అన్నారు.

    మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ...అప్పట్లో మనం జంధ్యాల గారి సినిమాలు చూసి ఎంత హాయిగా నవ్వుకునే వాళ్లమో ఈ పుష్పక విమానం సినిమా చూసి అంతే ఆనందిస్తాం. ఆనంద్ ఫెంటాస్టిక్ గా నటించాడు, విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే ఎప్పుడూ మాస్క్ తీయని విజయ్..వాళ్లు రాగానే దగ్గరకు తీసుకుని పలకరిస్తున్నారు. పుష్పక విమానం తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది. అన్నారు.

    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, భద్రం, సుదర్శన్, వీకే నరేష్ తదితరులు
    సమర్పణ: విజయ్ దేవరకొండ
    సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
    ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్,
    ఎడిటర్ : రవితేజ గిరిజాల
    మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.
    కాస్టూమ్స్ : భరత్ గాంధీ
    నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లి
    రచన-దర్శకత్వం: దామోదర
    బ్యానర్స్: కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్
    పీఆర్‌వో: జీఎస్‌కె మీడియా

    English summary
    Actor Anand Deverakonda's Pushpak Vimanam coming to Theatres on November 12th. In this occassion, This movie pre release event held in Vizag. Vijay Deverakonda gets emotional in this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X