For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణలా తొడగొట్టించి.. పవన్ కల్యాణ్‌లా మెడను రాకి.. బిత్తిరి సత్తి ఎమోషనల్

  |

  యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై అందరి అభిమానాన్ని చూరగొంటున్న బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. టీ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆదేశ్ రవి, పోషి లాంటి స్థానిక కళాకారులు నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నేతల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస యాదవ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో బిత్తిరి సత్తి మాట్లాడుతూ..

  కరీంనగర్ జిల్లాతో

  కరీంనగర్ జిల్లాతో

  కరీంనగర్ జిల్లాతో నాకు అనుబంధం ఉంది. వీ6 ఛానెల్ అధినేత వివేక్ నన్నుయాంకర్ చేస్తే, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నన్ను హీరోగా చేశారు. నన్ను నమ్మి సినిమా చేసిన రసమయికి రుణపడి ఉంటాను. 2003లో దిల్ సినిమా కోసం ఆడిషన్స్ వెళ్లాను. నా ఫోటోలు ఇచ్చి వచ్చాను. అలాంటి నిర్మాత నా తుపాకి రాముడు సినిమాను రిలీజ్ చేయడం అంతా శుభసూచకం అని బిత్తిరి సత్తి అన్నాడు.

  రూపం ఒక్కటే సరిపోదు

  రూపం ఒక్కటే సరిపోదు

  వినోద రంగంలో రాణించాలంటే రూపం ఒకటే సరిపోదు. విలక్షణమైన లక్షణం ఉండాలని చెప్పారు. నేను బిత్తిరి సత్తిగా మీ అందరి మన్ననలు అందుకోవాడానికి నా ఇంటి పక్క వ్యక్తి ముకుందరెడ్డి స్ఫూర్తి. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం బాధకరం. సమాజంలోని వ్యక్తుల హావభావాల నుంచే నేను నా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకొన్నాను అని బిత్తిరి సత్తి చెప్పాడు.

  నా తండ్రి లేకపోవడం

  నా తండ్రి లేకపోవడం

  ఓ సోసైటీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎంతటి ఆదరణ లభించడం గర్వంగా ఉంది. మీ ప్రోత్సాహంతోనే బత్తిరి సత్తిగా, ఇస్మార్ట్ సత్తిగా, తుపాకీ రాముడిగా మీ ముందు నిలపడ్డాను. నా ఎదుగుదలను చూడటానికి నా తండ్రి లేడు. కానీ నా తల్లి చూసి సంతోషపడుతున్నది. ఎక్కడో బ్యాక్ గ్రౌండ్‌లో ఉండే వ్యక్తిని కెమెరా ముందుకు తీసుకువచ్చారు. నాతోనే పవన్ కల్యాణ్ లాగా మేనరిజం చేయించి.. బాలకృష్ణలా తొడగొట్టించారు అని బిత్తిరి సత్తి ఎమోషనల్ అయ్యారు.

  సింగపూర్‌కు వెళ్లలేదు

  సింగపూర్‌కు వెళ్లలేదు

  తుపాకి రాముడు సినిమా లోకేషన్ల కోసం సింగపూర్‌కు వెళ్లలేదు కానీ.. సింగరేణికి వెళ్లాం. నా సినిమాలో పేరున్న నటీనటులు కావాలని కోరుకుంటే.. దర్శకుడు బతుకమ్మ ప్రభాకర్ లోకల్ టాలెంట్‌ను పరిచయం చేశారు. పోషి, ఆదేశ్ రవి లాంటి యువ కళాకారులు ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటారు అని బిత్తిరి సత్తి పేర్కొన్నారు.

  అందర్నీ ఏడిపిస్తాను

  అందర్నీ ఏడిపిస్తాను

  ఇప్పటి వరకు నేను అందర్నీ నవ్వించాను. కానీ తుపాకీ రాముడు ద్వారా నేను అందర్నీ ఏడిపిస్తాను. నవ్వులోనే కాదు.. ఏడుపులో కూడా ఆనందం ఉంటుందనే విషయం ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. మేము ఇప్పటి వరకు నాలుగు సార్లు చూసినా నాలుగు సార్లు ఏడ్చినా అని బిత్తిరి సత్తి అన్నారు. ఈ సినిమా నాకే కాదు అందరికీ పేరు తెస్తుంది అని అన్నారు.

  ఆటో నుంచి ఆడీ వరకు

  ఆటో నుంచి ఆడీ వరకు

  బఠానీలు బుక్కేటోనికి బాదం పలుకులు తినే అవకాశం కల్పించారు. ఆటోలో వెళ్లే వాడికి ఆడీ కారులో తిరిగే అవకాశం ఇచ్చిన మీ అభిమానం. కురిసే గుడిసే నుంచి విల్లాలో ఉండేలా చేసింది మీ అభిమానం. నా సినిమాను ఆదరించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు. మీ అభిమానం ఎప్పటికీ నాపై ఉండాలి అని బిత్తిరి సత్తి ఎమోషనల్ అయ్యాడు.

  English summary
  Anchor Bithiri Sathi gets emotional at Tupaki Ramudu pre release function. Minister Harish Rao, Srinivasa Yadav are the chief guest for This movie which held hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X