బుల్లితెరకి కరోనా ఎఫెక్ట్ : ప్రదీప్‌కి పాజిటివ్.. అందుకే ఆ షోలో యాంకర్ రవి !
తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వైరస్ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. సినీ రంగం అలాగే టెలివిజన్ రంగం మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలకు. నటీనటులకు. సినీ బృందాల్లో టెక్నీషియన్స్ కి వైరస్ సోకడంతో పెద్ద సినిమాల షూటింగ్ కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి.. బుల్లితెర మీద కూడా కరోనా ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తోంది. ఈ మధ్యనే జబర్దస్త్ భామ వర్షకి కరోనా సోకగా తాజాగా యాంకర్ ప్రదీప్ కి కూడా కరోన సోకినట్లు తెలుస్తోంది.

కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ లో
ఎలా సోకిందో తెలియదు గానీ ప్రదీప్ మాచిరాజు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలుస్తోంది.. అలాగే డాక్టర్ల సూచన మేరకు కరోనా వైద్యం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.. అయితే ఈ మేరకు పెద్ద ఎత్తున టెలివిజన్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రదీప్ మాచిరాజు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఆ ప్రోమోలో కనపడక పోవడంతో
ప్రస్తుతం ప్రదీప్ ప్ జి తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ షోతో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న డీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన డ్రామా జూనియర్స్ సీజన్ ఫైవ్ ప్రోమోలో ప్రదీప్ కనపడకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. డ్రామా జూనియర్స్ సీజన్ ఫైవ్ కి ఎస్ వి కృష్ణారెడ్డి, రేణుదేశాయ్, సింగర్ సునీతలు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

క్లారిటీ ఇస్తే కానీ
అయితే ఈ షో నుంచి తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రదీప్ స్థానంలో యాంకర్ రవి యాంకరింగ్ చేయడంతో ఈ ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్లయింది. ఆయనకు కరోనా సోకడంతోనే రవి రంగంలోకి దిగాడు అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే దీని మీద ప్రదీప్ క్లారిటీ ఇస్తే గాని నిజమేనని చెప్పలేము. ఒక్కోసారి వేరే షోలు, సినిమాలు, లేదా ఈవెంట్స్ కోసం డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. సో అధికారికంగా ప్రదీప్ క్లారిటీ ఇస్తే కానీ చెప్పలేం.
Recommended Video

హీరోగా మెరిసి
ఇక ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ఈ ఏడాది జనవరి 29వ తారీఖున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాట సూపర్ హిట్ కావడంతో ఆ పాట జనాన్ని థియేటర్లకు రప్పించింది. అయితే అనుకున్నంతగా ఈ సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. రొటీన్ కథ కావడంతో పాటు నిర్మాణ విలువలు కాస్త అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ సాధించలేదు పోయింది.


Click it and Unblock the Notifications











