twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యునరేషన్ విషయంలో తెలివిగా ఆలోచించిన యాంకర్ ప్రదీప్.. మొదటి సినిమాకు తీసుకున్నదెంత..?

    |

    టెలివిజన్ ఆడియేన్స్ కు యాంకర్ గా బాగా దగ్గరైన ప్రదీప్ ఇప్పుడు హీరోగా మరింత దగ్గరవ్వాలని అడుగులు వేస్తున్నాడు. హీరోగా నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకుంటున్న ప్రదీప్ రెమ్యునరేషన్ ఎంత అందుకొని ఉండవచ్చనే సందేహాలు చాలానే వైరల్ అవుతున్నాయి.

    ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు

    ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు

    బుల్లితెరపై సక్సెస్ అయితే చాలా ఈజీగా బిగ్ స్క్రీన్ పై అవకాశాలు అందుకోవచ్చు. కానీ అలా అందరూ సక్సెస్ అవ్వలేరు. ఇక యాంకర్స్ కు ఉండే క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రియాలిటీ షోలు, టాక్ షోలు అంటూ ఎన్నో రకాల ఈవెంట్స్ తో క్రేజ్ అందుకున్న ప్రదీప్ హీరోగా ట్రై చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాడు. ఇక మొత్తనికి ఒక ప్రేమ కథ ద్వారా సరికొత్త ఎంట్రీ ఇచ్చాడు.

    అంచనాలను బాగానే క్రియేట్ చేసింది

    అంచనాలను బాగానే క్రియేట్ చేసింది

    '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే ఆ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలను బాగానే క్రియేట్ చేసింది. ఇటీవల ట్రైలర్ ను కూడా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు నీలి నీలి ఆకాశం పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యూ ట్యూబ్ లో ఆ సాంగ్ 300మిలియన్ల వ్యూవ్స్ ను అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.

    సినిమాను గత ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాల్సింది

    సినిమాను గత ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాల్సింది

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మొత్తానికి జనవరి 29న గ్రాండ్ గా విడుదల అయ్యింది. అసలైతే ఈ సినిమాను గత ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాల్సింది. కరోనా లాక్ డౌన్ కంటే ముందే సినిమాను రెడీ చేశారు. కానీ లాక్ డౌన్ దెబ్బకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి కలెక్షన్స్ ను అందుకుంటోంది.

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే ఉన్నప్పటికీ ఆ టార్గెట్ ను ప్రదీప్ అందుకుంటాడా లేదా అనేది మొదట్లో కాస్త అనుమానాలు కలిగించింది. 30రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4కోట్లకు పైగానే ధర పలికింది. తెలుస్తోంది. ఇక సినిమా మొదటి రెండు రోజుల్లో రెండు కోట్ల షేర్స్ ను దాటేసినట్లు సమాచారం.

    ప్రదీప్ రెమ్యునరేషన్

    ప్రదీప్ రెమ్యునరేషన్

    ఈ ఆదివారం కూడా కలెక్షన్స్ బావుంటే సినిమా చాలా తొందరగా ప్రాఫిట్ జోన్ లోకి వస్తుంది. ఇక ఈ సినిమాకి ప్రదీప్ రెమ్యునరేషన్ బాగానే తీసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి. యాంకర్ గా రోజుకు లక్షకు పైగా పేమెంట్స్ అందుకునే ప్రదీప్ నిజానికి సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని టాక్ వస్తోంది.

    Recommended Video

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? Release Date ఫిక్స్
    ఆ విషయాన్ని కూడా

    ఆ విషయాన్ని కూడా

    ప్రదీప్ సినిమా కథ బాగా నచ్చడం వలన రెమ్యునరేషన్స్ ఇవ్వకపోయినా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమా క్వాలిటీ విషయంలో నిర్మాత ఏ మాత్రం తగ్గలేదు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నాడు. లాభాల్లో కొంత షేర్స్ అందుకునే ఛాన్స్ తెలుస్తోంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి..

    English summary
    Suma Domination has always been one of the best anchors in the Telugu industry. However, Pradeep Machiraju is also among those who continue to be the best anchor after her. It is known that Pradeep made a movie as a hero who gained a lot of fans by interviewing top heroes very closely not only with reality shows but also with talk shows.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X