twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ హీరోగా యాంకర్ రవి.. ‘తోటబావి’తో రచ్చ చేస్తాడా?

    |

    బుల్లితెర స్టార్లు వెండితెరపై హీరోలుగా ఎదిగేందుకు ఎంతో ఉబలాట పడుతుంటారు.బుల్లితెరపై ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాక 70ఎంఎం తెరపై హీరోలుగా మారాలని అనుకుంటారు. ఇందులో ముందుగా యాంకర్ రవి ప్రయత్నించాడు. ఇది మా ప్రేమ కథ అనే చిత్రంతో హీరోగా వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మేఘనా లోకేష్ రవి జంటగా వచ్చిన ఈ చిత్రం నిరాశను మిగిల్చింది.

    ఇప్పుడు సుధీర్, ప్రదీప్ వంటి వాళ్లు హీరోలుగా నిలబడేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. అందుకే రవి కూడా సైలెంట్‌గా ఓ సినిమాను పట్టాలెక్కించేశాడు. గౌత‌మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు(విష్ణుప్రియహోట‌ల్) చిన్న స్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభినేష్. బి స‌హ‌నిర్మాత‌. ఇటీవలే ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేయగా టీజర్ కి విశేష స్పందన లభించింది. కాగా ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

    Anchor Ravi Thotabhavi Movie on 5th march,

    ఈ సందర్భంగా దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మేము అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది సినిమా. సెన్సార్ చేసిన సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. హీరో ర‌వి నటనను ప్రసంశించారు. ముందునుంచి రవిగారు ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో థ్రిల్ చేయడానికి ఈ మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని అన్నాడు. నిర్మాతలు ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు చిన్న స్వామి, అభినేష్.. మాట్లాడుతూ మార్చి 5 న రాబోతున్న ఈ సినిమా ని ప్రేక్షకులను ఆదరించాలని కోరారు.

    English summary
    Anchor Ravi Thotabhavi Movie on 5th march,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X