‘యాంకర్ సుమను ఇలాగే కౌగిలించుకొంటా.. ఎవరేం చేస్తారో చూస్తా’

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 28 ఏళ్ల క్రితం విడుదలై భారతీయుడు సినిమా సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ అవుతున్నది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కమల్ హాసన్, సముద్రఖని, ఎస్జే సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ మాట్లాడుతూ..

స్టేజ్ మీదకు వచ్చి రాగానే తనకు ఇష్టమైన సుమను కౌగిలించుకొని మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం బాయ్స్ సినిమా ఆడియో లాంచ్ కోసం హైద్రాబాద్‌కు వచ్చాను. ప్రతీ యూత్‌కి బాయ్స్ సినిమా ఎక్కుతుందని నన్ను హీరోగా పెట్టి శంకర్ గారు సినిమా తీశారు. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ప్రతీ భారతీయుడుకి ఈ భారతీయుడు 2 ఎక్కుతుందని నన్ను మళ్లీ హీరోగా తీసుకొచ్చారు. నన్ను డిస్కవర్ చేసిన నా కొలంబస్ శంకర్ గారికి థాంక్స్ అని అన్నారు.

Anchor Suma and Siddharth hugs on Indian 2 pre release event stage goes viral

ఇంత వరకు నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా నాకు ఇష్టమైన హీరో ఎవరంటే కమల్ హాసన్ గారు అని చెబుతూనే వచ్చాను. ఆయనతో ఇలా కలిసి నటించడం, ఆయనతో కలిసి ఇలా కూర్చోవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన, నాకు చిత్రం ఇంత స్వేచ్చను ఇచ్చిన కమల్ హాసన్ గారికి థాంక్స్ అని సిద్దూ అన్నారు.

శంకర్ గారిని తెలుగు దర్శకుడే అని ఇక్కడి ప్రేక్షకులు భావిస్తుంటారు. మళ్లీ భారతీయుడు 2తో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రతీ ఒక్కరూ సినిమాను చూడండి. భవిష్యత్తు తరాల గురించి ఈ చిత్రం మాట్లాడుతుంది. సినిమాను నిర్మించిన లైకా సుభాస్కరన్, రెడ్ జెయింట్ మూవీస్‌‌కు థాంక్స్. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. రకుల్, బాబీ సింహా, సముద్రఖని అన్నాకు థాంక్స్. జూలై 12న ఈ చిత్రం రాబోతోంది. శంకర్ గారి విజన్ మొబైల్, టీవీలో ఎక్కదు కాబట్టి.. బిగ్ స్క్రీన్‌లో అందరూ చూడండి. మీ సిద్దూను నా టైమ్ వచ్చేస్తుంది అని అన్నారు అని సిద్దార్థ్ రిక్వెస్ట్ చేశారు.

Anchor Suma and Siddharth hugs on Indian 2 pre release event stage goes viral

అంతలోనే సుమ వచ్చి.. సిద్దార్థ్ గారు.. అంటే.. ఎస్ సుమ డార్లింగ్ అంటూ భుజం మీద చేయి వేశారు. లాస్ట్ టైమ్ ఓ ఈవెంట్‌ చేస్తుండగా.. ఇలా కౌగిలించుకొన్నాం. దాన్ని చూసి ఏంటి ఇద్దరు ఓవర్ చేస్తున్నారని అన్నారు. కానీ మేమిద్దరి ఇంతే అండి. ఇలాగే ఉంటాం. ఇలాగే కౌగిలించుకొంటాం. ఏం చేస్తారు మీరు అని సిద్దూ అనడం.. సుమ నవ్వుల్లో మునిగిపోవడం కనిపించింది.

ఆ తర్వాత సుమ గురించి మాట్లాడుతూ.. ఆమె రోజు రోజుకు యంగ్ అయిపోతున్నది. గ్లామర్ అలానే మెయింటెన్ చేస్తున్నారు. చక్కటి తెలుగు మాట్లాడి.. పాటలు పాడుతున్నారు. ఇంకా ఇండియన్ 2 కాదు.. ఇండియన్ 3, 4, 5 సినిమాల ఈవెంట్లకు ఆమె హోస్ట్‌గా ఉండాలి. ప్రపంచంలో ఏదైనా మారకుండా ఉన్నామంటే.. మేమిద్దరం 20 ఏళ్ల నుంచి మారలేదు. మా గ్లామర్ ఇలానే ఉంది అని అన్నారు.

More from Filmibeat

Read more about: suma siddharth indian 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X