మెగా ఫ్యాన్స్‌కు పవన్ కల్యాణ్ సాఫ్ట్ వార్నింగ్.. సినిమాలపైనా డిప్యూటీ సీఎం ఊహించని వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా సినిమా రంగంలో, కొన్నేళ్లుగా రాజకీయాల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల పక్షాన నిలబడుతూ మంచి పేరు తెచ్చుకున్న ఈ బడా హీరో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..!
డిప్యూటీ సీఎంగా పవన్
ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. పవన్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం సహా పలు శాఖలు తీసుకున్నారు.

సినిమాలకు బ్రేకిచ్చేసి
రాజకీయాల్లో యాక్టివ్ అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలు కూడా చేస్తూ వచ్చారు. ఇలా ఈ మధ్య కాలంలోనే ఆయన ఎన్నో చిత్రాలను చేసి అలరించారు. అయితే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మాత్రం పవన్ కల్యాణ్ పూర్తిగా ప్రజాసేవపైనే ఫోకస్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన సినిమాలను కొంత కాలం పాటు ఆపేయాలని డిసైడ్ అయ్యారు.

త్వరలోనే ఆ సినిమానే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవడం వల్ల సినిమా షూటింగ్‌లకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే ప్రారంభం అయిన సినిమాలు అలా ఉండిపోయాయి. అయితే, త్వరలోనే పవన్ షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారని ఇటీవలే న్యూస్ లీకైంది. ముందుగా ఆయన 'హరిహర వీరమల్లు' కోసం ఓ సీక్వెన్స్‌ను చేయబోతున్నారట.

ఎక్కడికి వెళ్లినా గోలలే
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కల్యాణ్ చాలా మీటింగ్‌లలో పాల్గొన్నారు. ఇందులో బహిరంగ సభలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఆయన అభిమానులు ఓ రేంజ్‌లో గోలలు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల అప్‌డేట్లు కావాలని డిమాండ్లు చేస్తున్నారు. కానీ, దీనిపై పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు.
సాప్ట్ వార్నింగ్ ఇస్తూ
తాజాగా పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు 'ఓజీ' సినిమా గురించి అరుస్తున్నారు. అది గమనించిన డిప్యూటీ సీఎం స్పీచ్ ఆపేసి మరీ దీనిపై స్పందించారు. 'సినిమా గురించి సినిమా థియేటర్లలోనే చూడండి. ఎందుకంటే నేను సినిమాలను, రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తాను' అంటూ ఫ్యాన్స్‌కు సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారు.
సినిమాల కంటే కూడా
పవన్ కల్యాణ్ స్పీచ్ కంటిన్యూ చేస్తూ.. 'సినిమాల్లో ఉంటే సినిమానే ముఖ్యం. కానీ, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు సినిమాల కంటే దేశం ముఖ్యం. అలాగే, సమాజం ముఖ్యం.. గ్రామ హితం ముఖ్యం. అన్నం పెట్టే రైతు బాగుంటేనే అన్నీ బాగుంటాయి. గ్రామాలు పచ్చగా ఉంటేనే అన్నీ బాగుంటాయి' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











