మహేశ్ బాబుతో ఆ దర్శకుడి సినిమా కన్ఫార్మ్: ప్రకటన ఒకటే బ్యాలెన్స్ ఉంది

కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇప్పటికే 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొదటి షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. దీనికి ఇంకా చాలా భాగం షూట్ చేయాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ మహేశ్ వరుసగా తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి కొత్త చిత్రంపై అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

'సర్కారు వారి పాట' తర్వాత మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన ఇటీవలే వెలువడింది. ఇది మాత్రమే కాకుండా మరో సినిమాను కూడా అతడు మొదలెట్టబోతున్నాడట. దానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడని తెలిసింది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సదరు దర్శకుడు మాట్లాడుతూ.. 'మహేశ్ గారి కోసం కథ రెడీగా ఉంది. ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు మొదలు పెట్టేస్తాం' అని వెల్లడించాడు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చేసింది. గతంలో వీళ్లిద్దరి కలయికలో 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే.

Anil Ravipudi Clarity about Mahesh Babu Movie

ఇక, మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రాజెక్టు వచ్చేందుకు చాలా సమయం ఉండడంతో మధ్యలో మరిన్ని చిత్రాల్లో నటించాలని భావిస్తున్నాడు. అందుకే 'సర్కారు వారి పాట' తర్వాత త్రివిక్రమ్‌తోనూ, అనిల్ రావిపూడితోనూ సినిమాలు చేయబోతున్నాడని అంటున్నారు. ఇదే నిజం అయితే సూపర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X