యువ దర్శకుడితో బాలయ్య చిత్రం ఖరారు!
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాలతో యువ దర్శకుడు అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. కమర్షియల్ చిత్రాలకు మంచి కామెడీ జోడించి మ్యాజిక్ చేయడం అనిల్ రావిపూడికి అలవాటు. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న చిత్రం ఎఫ్2. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని అనిల్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ఇటీవల అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తదుపరి చిత్రాల గురించి వివరించాడు. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని అనిల్ రావిపూడి తెలిపాడు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే బాలయ్యతో తన సినిమా ప్రారంభిస్తానని అనిల్ తెలిపాడు.

ఈ చిత్రంలో బాలయ్యని తాను మునుపెన్నడూ లేని విధంగా చూపిస్తానని అనిల్ రావిపూడి అంచనాలు పెంచాడు. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఎఫ్ 2 చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 11 న రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రం విడుదలవుతుంది. ఇలా ఈ సారి సంక్రాంతికి బాక్సాఫీస్ పోటీ రసవత్తరంగా మారనుంది.


Click it and Unblock the Notifications











