బాలయ్య కోసం ఖాళీగా ఉండలేక మరో ప్లాన్ వేసిన స్టార్ దర్శకుడు?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకవైపు హీరోలు మరో వైపు దర్శకులు కూడా చాలా బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న దర్శకులకు హీరోలు దొరకడం లేదు.. పెద్ద సినిమాలు చేయాలనుకుంటున్న హీరోలకు మంచి దర్శకుడు దొరకడం లేదు. అందరు కూడా చాలా బిజీ అయిపోయారు అనే చెప్పాలి. ఇక నందమూరి బాలకృష్ణ కూడా అఖండ సినిమా తర్వాత మళ్లీ పెద్ద సినిమాలతో బిజీ కాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రవితేజ క్రాక్ సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న గోపీ చంద్ మలినేని ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మరొక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ కథతో రాబోతున్నాడు.

బాలకృష్ణ మాస్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని కథను రెడీ చేసుకున్న గోపీచంద్ మలినేని తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగానే బాలయ్యను చూపించబోతున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమాను పూర్తి చేయడానికి బాలకృష్ణ కు చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాది దసరా సమయంలో సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అలాగే అనిల్ రావిపూడి కూడా బాలకృష్ణ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబినేషన్ పై గత రెండు మూడేళ్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇద్దరికి సరైన సమయం దొరకడం లేదు. ఒకసారి అనిల్ రావిపూడి బిజీగా ఉంటే బాలకృష్ణ కాళీ గా ఉంటున్నారు. మరొకసారి బాలకృష్ణ బిజీగా ఉంటే అనిల్ రావిపూడి ఖాళీగా ఉంటున్నారు. ఈ సారి ఎలాగైనా బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతంలోనే బాలయ్యకు చెప్పిన కథను కూడా అనిల్ అలానే ఉంచినట్లు సమాచారం.

Anil ravipudi new project with young hero before balakrishna project

ఇక మళ్ళీ ఎప్పటిలానే బాలయ్య మళ్లీ గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ అయ్యాడు. ఇక అనిల్ F 3 సినిమా కూడా త్వరలోనే ఫినిష్ కానుంది. ఏప్రిల్ 29న ఆ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక బాలయ్య తో సినిమా చేసే కంటే ముందే అనిల్ రావిపూడి రెండు మూడు నెలల్లో మరొక రొమాంటిక్ లవ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టాక్ అయితే వస్తుంది. ఇప్పటికే రెండు మూడు కథలను సిద్ధం చేసుకున్న అనిల్ అందులో ఏదో ఒక కథను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బాలకృష్ణకు కూడా ఫైనల్ కథను చెప్పి ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో నాచురల్ స్టార్ నాని తో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో కూడా టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఇదివరకే వీరి కాంబినేషన్ లో సుప్రీమ్ అనే సినిమా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మరి అనిల్ రావిపూడి బాలయ్య కంటే ముందు ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X