NBK 107: బాలయ్య కోసం మరో గ్లామరస్ బ్యూటీ.. మాస్ ఆడియెన్స్ కు పిచ్చెక్కచ్చే పాత్రలో..

అఖండ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ అదే తరహాలో తదుపరి సినిమా తో కూడా సక్సెస్ అందుకోవాలని రెడీ అయ్యాడు. ఇదివరకే నందమూరి బాలకృష్ణ వరుస అపజయాలతో కాస్త సతమతమైన విషయం తెలిసిందే. ఇక మళ్లీ అతనికి చాలా కాలం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక హిట్ అందుకోవడం విశేషం. ఇంతకుముందు కూడా వరుస పరాజయాలతో ఉన్నప్పుడు బోయపాటి దర్శకత్వంలో సింహ లెజెండ్ అనే సినిమాలతో బాలకృష్ణ మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని కూడా బాలకృష్ణ ఫోకస్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 150 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా కంప్లీట్ గా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ హీరోలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందే ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ తో క్రాక్ అనే సినిమా చేసి ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

another beautiful heroine for nandamuri balakrishna upcoming project

ఆ సినిమా తర్వాత అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ గోపిచంద్ మాత్రం తన తదుపరి సినిమాను బాలయ్య బాబు తోనే చేయాలి అనే పర్ఫెక్ట్ పవర్ఫుల్ కథతో సిద్ధమయ్యాడు. నందమూరి బాలకృష్ణ కూడా గోపీచంద్ మలినేని కథ చెప్పిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక అభిమానుల్లో ఈ ప్రాజెక్టు పై అంచనాలు మామూలుగా లేవు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ కమర్షియల్ అంశాల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అని తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా శృతి హాసన్ ఒక పాత్రలో కనిపిస్తుండగా కోలీవుడ్ లేడి విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. అయితే ఆడియన్స్ కు పిచ్చెక్కించే మరొక గ్లామరస్ క్యారెక్టర్ ను కూడా గోపీచంద్ సినిమాలో హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. అందుకోసం ఈ దర్శకుడు ఇటీవల కొంతమంది హీరోయిన్స్ ని సంప్రదించినట్లు సమాచారం.

ఇక ఫైనల్ గా అతను ఒక మలయాళ బ్యూటీని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో రెండవ మహిళా ప్రధాన పాత్ర కోసం అందమైన మల్లు నటి హనీ రోజ్‌ను ఎంచుకున్నారట. ప్రధాన కథానాయికగా శ్రుతి హాసన్‌ నటిస్తుండగా ఆమె రెండవ హీరోయిన్ గా కనిపించనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

హనీ రోజ్‌ ఇదివరకే మంచి నటిగా మలయాళం ఇండస్ట్రీలో ఒక రేంజ్లో గుర్తింపును అందుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తో గోపీచంద్ మలినేని సరికొత్త క్యారెక్టర్ ను క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకుంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X