నాగార్జునకు ఎంతో ఇష్టమైన కథ.. ఇంకా సెట్టవ్వలేదట!
కింగ్ నాగార్జున కథల ఎంపిక ఎంత డిఫరెంట్ గా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రయోగాలు చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే నాగ్ ఈ వారం వైల్డ్ డాగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం మిక్సీడ్ టాక్ తో వెళుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
అయితే నాగార్జునకు ఎంతో ఇష్టమైన కథ ఇంకా సెట్టవ్వలేదట. నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో సోగ్గాడే చిన్ని నాయనా ఒకటి. అయితే ఆ సినిమా హిట్టవ్వడంతో కొనసాగింపుగా బంగార్రాజును లైన్ లో పెట్టాడు. టైటిల్ తో పాటు సినిమా మెయిన్ స్టోరీ కూడా సెట్టయ్యింది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇప్పటికే చాలాసార్లు నాగ్ తో చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇక సినిమా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఆ మధ్య రూమర్స్ బాగానే వచ్చాయి. అయితే ఇంకా ఆ కథ పూర్తిగా సిద్ధమవ్వలేదని తెలుస్తోంది. ఇటీవల వైల్డ్ డాగ్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్తు ప్రాజెక్టుపై స్పందించిన నాగార్జున బంగార్రాజు ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నట్లు వివరించారు. అంటే సినిమా వచ్చే సంక్రాంతికి రావడం అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











