మెగా ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. సర్‌ప్రైజ్ చేయనున్న రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ దూకుదు ప్రదర్శిస్తున్నాడు. ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పాలు పంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అందులో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' కాగా, మరొకటి తన తండ్రి హీరోగా నటిస్తున్న 'సైరా: నరసింహారెడ్డి'. వీటిలో ఒకవైపు నటుడిగా.. మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు ఈ మెగా కాంపౌండ్ హీరో.

ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ

ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల సోషల్ మీడియా మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటరైన విషయం తెలిసిందే. అభిమానులు, సన్నిహితులతో నిత్యం టచ్‌లో ఉండేందు కోసం చెర్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘always ram charan' పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టాడు ఈ మెగా హీరో. దీంతో అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని ఫ్యాన్ పేజీలలో షేర్ చేసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

మొదటి పోస్టుతో మెప్పించాడు

మొదటి పోస్టుతో మెప్పించాడు

ఇన్‌స్టాలో ఎంటరైన తర్వాత ఒక సర్‌ప్రైజ్ ఫొటోను షేర్ చేస్తానని చెర్రీ చెప్పాడు. అన్నట్లుగానే రెండు రోజుల క్రితం తన తల్లితో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘నా తొలి పోస్ట్‌ నీకే అంకితం చేస్తున్నా.. లవ్యూ అమ్మా.. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అమ్మ ప్రేమ మాదిరిగా' అంటూ తన తల్లి ఒడిలో తలపెట్టుకుని హాయిగా చిరునవ్వులు చిందుస్తున్న ఫొటోనే షేర్ చేశాడు రామ్ చరణ్. మరో ఫొటోలో తన చిన్నప్పుడు తల్లి ఒడిలో ఇలాగే పడుకుని ఉన్న ఫొటోని షేర్ చేశారు.

విపరీతంగా పెరిగిపోతున్న ఫాలోవర్స్

విపరీతంగా పెరిగిపోతున్న ఫాలోవర్స్

రామ్ చరణ్ ఇన్‌స్టాలోకి ఎంటరైనప్పటి నుంచి రోజురోజుకూ ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడంతో ఇప్పటికే రామ్ చరణ్ ఫాలోవర్స్ ఇప్పటికే ఐదు లక్షలకు పైగా పెరిగిపోయారు. ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీలు కూడా చరణ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతానికి రామ్ చరణ్‌ను ఫాలో అవుతోన్న వారిలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే, చెర్రీ మాత్రం ఎవరీ ఫాలో అవడం లేదు.

త్వరలో ట్విట్టర్‌లోకి..

త్వరలో ట్విట్టర్‌లోకి..

రామ్ చరణ్ త్వరలోనే ట్విట్టర్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఖాతాలను తెరిచిన ఈ మెగా వారి అబ్బాయి.. కొద్దిరోజుల్లో ట్విట్టర్‌లోకీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చెర్రీ ఈ రెండు మూడు రోజుల్లోనే చేయనున్నాడని విశ్వసనీయంగా తెలిసింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చరణ్ అల్లూరు సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది. అలాగే, తన తండ్రి చిరంజీవి హీరోగా చేస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి'ని చరణే నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X