RC 15 లీక్.. పల్లెటూరి వ్యక్తిలా పంచె కట్టులో రామ్ చరణ్.. అసలు స్టోరీ ఇదే అన్నమాట?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా శంకర్ ఫ్యాన్స్ లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు తమిళంలోనే కాకుండా ఫ్యాన్ ఇండియా సినిమాగా మిగతా భాషల్లో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అందులో వివిధ రకాల లుక్స్ కూడా లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి సినిమాకు సంబంధించిన కథ గురించి కూడా అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాతోనే

ఈ సినిమాతోనే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని శంకర్ సినిమా తోనే సిద్ధమవుతున్నాడు. ఇంతకుముందు ఆచార్య సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ సినిమాతో తప్పకుండా మళ్ళీ సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పైనే ఎక్కువ స్థాయిలో అంచనాలు పెట్టుకుంటున్నారు.

లీక్స్ కొనసాగుతూనే ఉన్నాయి

లీక్స్ కొనసాగుతూనే ఉన్నాయి

అయితే RC 15వ సినిమాకు సంబంధించి ఇదివరకే చాలా రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన కొన్ని లుక్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. గతంలోనే చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కడ కూడా లీక్ కాకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకుంది. పటిష్టమైన సెక్యూరిటీ కూడా సిద్ధం చేసినప్పటికీ ఏదో ఒక రకంగా మళ్ళీ లీక్స్ కొనసాగుతూనే ఉన్నాయి.

మరో లుక్ లీక్

మరో లుక్ లీక్

రామ్ చరణ్ అంజలి కి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇదివరకే రాంచరణ్ రిక్షా తొక్కుకుంటూ ఒక సింపుల్ మెన్ గా కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోటోలో మాత్రం పంచ కట్టులో తన భార్య కొడుకుతో కనిపిస్తూ ఉండడం చూస్తూ ఉంటే సినిమాలో ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంది అని అనిపిస్తోంది.

రామ్ చరణ్ రెండు పాత్రల్లో

రామ్ చరణ్ రెండు పాత్రల్లో

ఇదివరకే ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ యాక్షన్ లో కనిపించబోతున్నట్లు ఒక టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఫోటోలను చూసిన తర్వాత రామ్ చరణ్ రెండు బిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు దాదాపు మరొక క్లారిటీ వచ్చేసింది. రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగానూ అలాగే ఆ తర్వాత కొడుకు గానూ కనిపిస్తాడని అర్థమయింది. ఇక అంజలి రామ్ చరణ్ కు తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 పొలిటికల్ బ్యాక్ డ్రాప్

పొలిటికల్ బ్యాక్ డ్రాప్

ఈ సినిమా అసలు కథ ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని అలాగే ఒక సాధారణ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎలా వెళ్ళాడు అనే కథను దర్శకుడు చాలా బలంగా చూపించబోతున్నట్లు కూడా ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. ఇక ఇప్పటివరకు ఆ విషయాలపై చిత్ర యూనిట్ ఎక్కడ కూడా పెద్దగా క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ సినిమా మాత్రం ఊహించని రేంజ్ లోనే ఉంటుంది అని దిల్ రాజు నమ్మకంగా తెలియజేశారు. ఇక సినిమాను మొదట సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు ఆలస్యం అవుతూ ఉండడంతో ఇప్పుడు 2023 సమ్మర్ లేదా ఆ తర్వాత విడుదల చేయవచ్చు అని మరొక కొత్త టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X