'పుష్ప' పుకార్ల గోల.. క్లారిటీ ఇచ్చే వరకు తగ్గేలా లేవు?
చాలా రోజుల తరువాత అల..వైకుంఠపురములో.. సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ పుష్ప సినిమాతో సిద్దమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనున్న బన్నీ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇక సినిమా ఎప్పుడు విడుదలవుతుందో గాని అప్పటి వరకు రూమర్స్ డోస్ తగ్గేలా లేదు. రోజుకో రూమర్ అభిమానుల్లో తెలియని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా రష్మీక మందన్న పాత్రకు సమానంగా ఉండే మరొక హీరోయిన్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ నివేత థామస్ ని ఫైనల్ చేసినట్లు కూడా సోషల్ మీడియాలో టాక్ రావడంతో అవన్నీ రూమర్స్ అని చిత్ర యూనిట్ టీమ్ నుంచి టాక్ వస్తోంది.

సినిమాలో కేవలం రష్మీక మందన్న మాత్రమే మెయిన్ హీరోయిన్ అని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. తమిళ్ మలయాళం కన్నడలోనే కాకుండా హిందీలో కూడా పుష్ప సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











