బ్లాస్ట్ చేయడానికి సిద్దమైన వెంకటేష్, వరుణ్ తేజ్.. F3 నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా విభిన్నమైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇక అందులో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కినటువంటి F3 సినిమా కూడా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. ఈ సినిమా కోసం కూడా ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎఫ్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో ఆ సినిమాకు ఫ్రాంచైజ్ గా దర్శకుడు అనిల్ రావిపూడి F3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో ఈ సారి కామెడీ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది అని దర్శకుడు చెబుతున్నాడు.

అసలైతే ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే మిగతా సినిమాల నుంచి పోటీ ఎక్కువగా ఉండటం వలన దిల్ రాజు రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు. అందుకే ఎలాంటి పోటీ లేకుండా సమ్మర్లో విడుదల చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది అని మరొక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను మే 27వ తేదీన విడుదల చేయబోతున్నాం విషయం తెలిసిందే.

Another surprise bomb from F3 movie special update ready

అయితే F 3 సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టేందుకు చిత్రయూనిట్ సభ్యులు ప్లాన్ మొత్తం రెడీ చేసుకుంటున్నారు. మొదట సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీజర్ ను విడుదల చేయబోతున్నారు. సోమవారం ఉదయం ఒక ప్రత్యేకమైన టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు గా అప్డేట్ అయితే ఇచ్చారు. ఉదయం 10:08 నిమిషాలకు ఫన్ బాంబ్ అనే టీజర్ ను విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ వరుణ్ తేజ్ తమన్నా భాటియా నటిస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఈసారి ఈ సినిమాలో సునీల్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. బ్యూటిఫుల్ తెలుగు హీరోయిన్ అంజలి కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో అలరించబోతోంది. ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా కూడా అంతకుమించి అనేలా విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని పాటలను కూడా ఇదే నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమా ట్రైలర్ను విడుదలకు ఒక పది రోజుల ముందే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో కామెడీ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఎక్కువగా మాస్ కమర్షియల్ సినిమాలో చూసిన ఆడియన్స్ మళ్లీ ఇలాంటి కామెడీ సినిమాను చూసేందుకు ఎగబడతారు అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది. పైగా పూర్తిగా హాలిడేస్ సమ్మర్ లో సినిమా వస్తూ ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో కలిసి సినిమా చూసే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X