బాలయ్య సినిమాలో ఆ సీనియర్ హీరోను కాదని.. మరో హీరో పై ఫోకస్?
lనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాల స్థాయిని పెంచేసింది. తప్పకుండా నందమూరి బాలయ్య ఈసారి అఖండ తరహాలోనే మరొక విజయాన్ని అందుకుంటాడు అని అందరూ నమ్మకంతో ఉన్నారు. బాలయ్య లుక్ కూడా చాలా మాస్ గా ఉండడంతో ఊహించని రేంజ్ లోనే బాక్సాఫీస్ షేక్ చేస్తారని అనిపిస్తోంది.
అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ ప్రాజెక్టును చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఆల్రెడీ మొదలయ్యాయి. ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న దర్శకుడు వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టాలి అని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ క్రమంలో సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్ హీరోలను సంప్రదించినట్లు గతంలోని ఒక టాక్ వచ్చింది.

ముఖ్యంగా రాజశేఖర్ ను అనుకుంటున్నట్లు కూడా కథనాలు అయితే వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఆ ఆలోచనలో మార్పులు చేసుకున్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది. దృవ సినిమాలో అద్భుతమైన విలనిజాన్ని చూపించిన మరొక తమిళ్ సీనియర్ హీరో అరవింద్ స్వామిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారట. బాలయ్య బాబుకు అతను విలన్ గా తప్పకుండా సెట్ అవుతాడు అని అందరూ ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా అరవిందస్వామిని ఇంకా దర్శకుడు కలవలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉన్నారు. ఇక ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం సినిమాకు మరింత హైప్ పెరిగే అవకాశం అయితే ఉంది.


Click it and Unblock the Notifications











