బాలకృష్ణ వెంట పడుతున్న మరో యువ దర్శకుడు.. మళ్ళీ అదే కాంబినేషన్!
నందమూరి బాలకృష్ణ సక్సెస్ చూసి చాలా కాలమయ్యింది. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి రావాలని అనుకున్నారు. కానీ సినిమా ఊహించని విధంగా నెగిటివ్ రిజల్ట్ ను అందుకుంది. సినిమాను ఎంతో నమ్మకంతో చేసిన బాలయ్య నిర్మాతగా కూడా నష్టాలను చూడాల్సి వచ్చింది. ఆ తరువాత వచ్చిన రూలర్ కూడా బాక్సాఫీస్ వద్ద రివర్స్ అయింది.
ఇక నెక్స్ట్ రాబోయే అఖండ సినిమాతో మాత్రం బాలకృష్ణ నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. ఫస్ట్ లుక్ టీజర్ తోనే ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ చేశాడు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తో సింహా - లెజెండ్ వంటి సినిమాల అనంతరం చేస్తున్న మూవీ కావడంతో ఓపెనింగ్స్ తోనే సరికొత్త రికార్డులు నమోదవుతాయని చెప్పవచ్చు.

ఇక అఖండ అనంతరం గోపిచంద్ మలినేనితో బిజీ కానున్న బాలయ్య ఆ తరువాత ఎవరితో వర్క్ చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే క్యూలో చాలామంది అగ్ర దర్శకులు ఉన్నారు. అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ వంటి వారు బాలయ్య కోసం ఇప్పటికే సాలీడ్ కథలను రెడీ చేసుకొని ఉన్నారు. ఇక మరొక యువ దర్శకుడు వెంకీ కుడుముల కూడా బాలయ్యతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
ఒకవేళ గ్రీన్ సిగ్నల్ లభిస్తే ఆ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించే అవకాశం ఉంది. గోపిచంద్ మలినేని - బాలకృష్ణ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మళ్ళీ అదే కాంబినేషన్ లో వెంకీ కుడుముల సినిమా రావచ్చని టాక్ అయితే వస్తోంది. మరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











