వకీల్ సాబ్ సందడిలోనే దిల్ రాజు ఫ్యామిలీ నుంచి యువ హీరో.. పవర్ఫుల్ టీమ్ ను సెట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ సీనియర్ మోస్ట్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా దశాబ్దాల పాటు కొనసాగడం అంటే చాలా కష్టమైన పని. వచ్చిన డబ్బు ఏ సినిమాతో పోతుందో తెలియదు. అయితే దిల్ రాజు మాత్రం చాలా తెలివిగా విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఇక ఈ నిర్మాత ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా ఒక యువ హీరో రాబోతున్నాడు.

దిల్ రాజు ఫ్యామిలీ నుంచి న్యూ హీరో
నటీనటులు వారి పిల్లల్ని వెండితెరపై చూడాలని ఎంత బలంగా కోరుకుంటారో తెలియదు గాని చాలా వరకు నిర్మాతలు మాత్రం వారసుడిని వెండితెరపై ఒక్కసారైనా ప్రజెంట్ చేయాలని కోరుకుంటారు. ఇక దిల్ రాజుకు కూతురు మాత్రమే ఉంది. ఆమెకు పెళ్లి కూడా అయిపోయింది. అయితే తన సోదరుడి కొడుకునే సినీ వారసుడిగా పరిచయం చేయడానికి దిల్ రాజు రెడీ అయ్యాడు.

ఇంతకు అతను ఎవరంటే
దిల్ రాజు కుటుంబం నుంచి వచ్చే ఆ హీరో మరెవరో కాదు. దిల్ రాజు సినిమాలన్నిటికి కూడా సహా నిర్మాతగా వ్యవహరించే శిరీష్ తనయుడి కొడుకు. అతని పేరు ఆశిష్ రెడ్డి. గత కొంత కాలంగా ఆశిష్ మొదటి సినిమాపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇటీవల ఫైనల్ గా ఒక కథ సెట్టవ్వడంతో వెండితెర అరంగ్రేటంకు రెడీ అయ్యారు.

వకీల్ సాబ్ సందడిలోనే
వకీల్ సాబ్ రిలీజ్ అవుతున్న సందడిలోనే గురువారం ఆశిష్ రెడ్డి సినిమా ఇంట్రడక్షన్ వీడియోను విడుదల చేయనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో వకీల్ సాబ్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఆశిష్ కొత్త సినిమాకు రౌడీ బాయ్స్ అనే టైటిల్ ను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా రోమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోందట.
Recommended Video

పవర్ఫుల్ టీమ్
ఇక రౌడి బాయ్ సినిమాకు దిల్ రాజు పవర్ఫుల్ టీమ్ ను రెడీ చేశాడు. హుషారు సినిమా దర్శకుడు హర్ష డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ఇక రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ మధి కూడా సెలెక్ట్ అయినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఆశిష్ కెరీర్ కు ఎలాంటి కిక్కిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











