అలాంటి కష్టాల్లో.. రాంచరణ్, సుస్మిత డబ్బులు వాడుకొన్నా.. పవన్ కల్యాణ్ ఎమోషనల్

పవన్ కళ్యాణ్ .. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన తన సొంత ప్రతిభతో పవర్‌స్టార్‌గా ఎదిగారు. డిఫరెంట్ మేనరిజం, స్టైల్, యాక్టింగ్‌తో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యారు. నటుడిగా కంటే గొప్ప మానవతావాదిగా పవన్‌ను అందరూ ఇష్టపడతారు. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే ఆదుకునే తత్వం, సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో కూడబెట్టలేదు పవన్. అయితే ఒకానొక సందర్భంలో ఆయన తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఈ వివరాల్లోకి వెళితే..

అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా తమ్ముడు, బద్రీ, గోకులంలో సీత, సుస్వాగతం వంటి సినిమాలు చేశారు. అయితే ఎస్‌జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషీ ఆయనకు తిరుగులేని స్టార్ డమ్‌ని తెచ్చిపెట్టింది. జానీ సినిమాతో దర్శకుడిగా మారి డిఫరెంట్ టేకింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. దాదాపు దశాబ్ధకాలం పాటు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. కానీ ఆయన స్టార్ డమ్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. తిరిగి గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో కలెక్షన్ల వర్షం కురిపించిన పవన్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశారు.

AP Dy CM pawan kalyan reveals his financial struggles from beginning days here s the details

సినిమాలే కాదు.. సమకాలీన పరిస్ధితులపై పవన్‌కు విస్తృతంగా అవగాహన ఉంది. అందుకే అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా కీలకపాత్ర పోషించారు. తను నమ్మిన సిద్ధాంతాలు, భావజలానికి అనుగుణంగా జనసేన పార్టీని స్థాపించి ప్రతిభావంతులను, సమర్ధులను నాయకులుగా తీర్చిదిద్దారు పవన్ . 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. పదేళ్ల పోరాటం తర్వాత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టి, డిప్యూటీ సీఎంగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

గడిచిన ఐదేళ్లలో ఆయన రూ.114.76 కోట్లను ఆర్జించగా.. ఆదాయపన్నుగా రూ.47.07 కోట్లు, జీఎస్టీ కింద రూ.26.84 కోట్లను చెల్లించారు. పవన్‌కు రూ. 64.26 కోట్లు అప్పులుండగా.. గడిచిన ఐదేళ్లలో రూ.20 కోట్లను విరాళాల రూపంలో అందజేశారు. రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించే లీడర్లు ఉన్న రోజుల్లో పవన్ వారికి పూర్తి విరుద్ధం. అయితే ఒకానొక సమయంలో ఆయనను ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

రామ్ చరణ్ తనకు చిన్న తమ్ముడిలా కనిపిస్తాడని.. నా మొదటి సినిమా పూర్తయిన తర్వాత డబ్బులు బాగానే ఉన్నాయని పవన్ చెప్పారు. అవి ఖాళీ అయిన తర్వాత సుస్మిత, చరణ్‌లు దాచుకున్న డబ్బుల్ని తీసుకుని వడ్డీతో కలిపి తర్వాత ఇచ్చేస్తానని చెప్పేవాడినని పవర్‌స్టార్ వెల్లడించారు. వాడుకున్న డబ్బుల్ని తాను ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదని.. ఆ డబ్బులు ఇవ్వాలని ఖుషీ సినిమా వరకు నాతో గొడవ పడేవాళ్లని ఆయన చెప్పారు.

అలాంటి చరణ్ హీరో అవుతున్నాడని తెలిసి తాను ఎంతో సంతోషించానని పవన్ తెలిపారు. ఈ సినిమా సమయంలో చరణ్ లైఫ్‌లో పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని, కానీ తనకు ఎవరి సపోర్ట్ లేకపోయినా ఒక్కడే హ్యాండిల్ చేశాడని ప్రశంసించారు. ఇక మొదటి సినిమా అనగానే ఎవరో ఒకరు సెట్‌లో ఉండటం కామన్.. కానీ తమంతా బిజీగా ఉండటంతో ఒక్కడే కష్టపడ్డాడని పవన్ కొనియాడారు. బాబాయ్‌గా కంటే ఒక అన్నయ్యగా రామ్ చరణ్ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు పవర్‌స్టార్ చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X