ఎన్టీఆర్ కూల్ లుక్ అదుర్స్.. అరవింద సమేత ఆడియో రిలీజ్ డేట్ ఖరారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేతపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అరవిందసమేత టీజర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలై విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు కళ్ళు చెదిరేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ ద్వారా ఈ విషయమే స్పష్టం అయింది.
ఈ చిత్రంలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. ఎన్టీఆర్, పూజ హెగ్డే మధ్య సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయని సమాచారం. గురువారం వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ పోస్టర్ ని విడుదల చేసింది. ఎన్టీఆర్ కూల్ లుక్ లో అదరగొడుతున్నాడు.

అదే సందర్భంలో ఆడియో విడుదల తేదీ కూడా ఖరారు చేశారు. ఈ నెల 20 న అరవింద సమేత ఆడియో విడుదల కానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఖరారు చేసింది. మాస్ ఎలిమెంట్స్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి ఈ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దసరా కానుకగా చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











