బిగ్ బాస్ బ్యూటినీ వదలని రాజ్ తరుణ్.. సీక్రెట్ అఫైర్ బయట పెట్టిన లవర్

తెలుగు ఇండస్ట్రీలో తాజాగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఓ యంగ్ హీరో తనను మోసం చేశాడంటూ అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం. సినిమా రేంజ్ ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతున్న యవ్వారంలో ఇద్దరు హీరోయిన్లతో పాటు ఓ స్టార్ యాంకర్ పేరు కూడా బయటకు వచ్చింది. కానీ యాంకర్ ఇంకా ఈ విషయం గురించి స్పందించకపోవడంతో ఆ అమ్మాయి చేసిన కామెంట్స్ ని నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి ఈ వివాదంలో ఆ యాంకర్ నిజంగానే యంగ్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందా? అనే విషయంపై ఒక లుక్కేద్దాం.

సదరు హీరో ఆ అమ్మాయితో తనకు ఎలాంటి సంబంధం లేదు అని కొట్టి పారేసినప్పటికీ, ఈ వివాదం రోజు రోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న కేసు ఎవరి గురించో కాదు యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి. ఈ హీరో పదేళ్లు తనతో రిలేషన్ షిప్ లో ఉండి, మరో హీరోయిన్ కోసం తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది.

Ariyana Glory Remains Silent Regarding Raj Tarun Controversy

తిరగబడరా సామి అనే సినిమాలో తనతో కలిసి నటించిన మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో గత కొంతకాలంగా రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపిస్తున్నాడని లావణ్య ఏకంగా కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు సమర్పించాలి అంటూ రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన లావణ్యకే పోలీసులు తిరిగి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ మాల్వి మల్హోత్రా తనకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, అసలు లావణ్య ఎవరో తనకు తెలియదని, తన కుటుంబం నుంచి ఎవరూ ఆమెను బెదిరించలేదని, ఆమెనే తమను ఫోన్ చేసి బెదిరిస్తోందని స్పష్టం చేసింది.

అక్కడితో ఆగకుండా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కారణంగా లావణ్యపై మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసింది. ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. లావణ్య మరోసారి ఆధారాలు ఇస్తూ మాల్వి, రాజ్ తరుణ్ పై రెండోసారి కూడా ఫిర్యాదు చేసింది. 170 ఫోటోలు, టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు మెడికల్ రిపోర్ట్స్ ను కూడా పోలీసులకు లావణ్య అందించినట్టుగా తెలుస్తోంది. దీంతో రాజ్ తరుణ్ న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ పై ఐపీసీ 493 సహా ఇతర సెక్షన్ల కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి, లావణ్య ఫిర్యాదును పరిశీలిస్తున్నామని చెప్పారు.

Ariyana Glory Remains Silent Regarding Raj Tarun Controversy

ఈ నేపథ్యంలోనే లావణ్య పదేళ్ళ క్రితమే రాజ్ తరుణ్, తను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని, అప్పటినుంచి ఇద్దరు కలిసి కాపురం చేయగా, రాజ్ తరుణ్ తనకు కొన్నాళ్ల క్రితం అబార్షన్ చేయించాడంటూ మరో బాంబు పేల్చింది.. ఈ నేపథ్యంలోనే లావణ్య చేసిన ఆరోపణల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ పేరు తెరపైకి వచ్చింది.

ఓ యాడ్ షూటింగ్లో కలిసిన వీరిద్దరూ ఎఫైర్ నడిపిస్తున్నారంటూ లావణ్య ఆరోపించింది. అయితే లావణ్య ఆరోపనలపై ఇప్పటిదాకా అరియానా స్పందించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రస్తుతం అమెరికాలోని మిస్సోరీలో ఉన్న అరియానా తన ట్రావెల్ వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. కానీ రాజ్ తరుణ్ వివాదంపై మాత్రం నోరు మెదపలేదు. మరి అరియనా ఈ వివాదంపై ఎప్పుడు మాట్లాడుతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: raj tarun ariyana glory lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X