46ఏళ్ళ హాట్ బ్యూటీతో కుర్ర హీరో ప్రేమాయణం.. అసలు గుట్టు బయటపడింది!

ఫ్యాషన్ వరల్డ్ లో కొన్ని ప్రేమ జంటలను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. వయసుతో సంబంధం లేకుండా ఏళ్ళ తరబడి డేటింగ్ చేసుకోవడం కామన్ గా మారింది. కొందరు ఎఫైర్స్ ని బహిరంగంగా ఒప్పుకున్నప్పటికి మరికొందరు మాత్రం సీక్రెట్ గానే నడుపుతున్నారు. ఇక బాలీవుడ్ లో ఎన్ని జంటలు ఉన్నా 'అర్జున్ మలైకా'ల లవ్ స్టోరీ మాత్రం నిత్యం ఎదో ఒక టాపిక్ తో వైరల్ అవుతూనే ఉంటుంది.

హాట్ బాంబ్..

హాట్ బాంబ్..

మలైకా అరోరా అంటే తెలియని ఆడియెన్స్ ఉండరు. బాలీవుడ్ హాట్ బాంబ్ గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు తెలుగులో కెవ్వుకేక సాంగ్ తో కూడా అలరించింది. ఐటమ్ సాంగ్స్ తో ఒకప్పుడు అందరిని ఎట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాలకు కాస్త దూరంగానే ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఏం మాట్లాడిన ఒక సెన్సేషన్ అని చెప్పవచ్చు. మీడియా అడిగే ప్రశ్నలకి కౌంటర్లు ఇవ్వడంలో ముందుంటుంది.

 చిన్నవాడితో ప్రేమాయణం..

చిన్నవాడితో ప్రేమాయణం..

మలైకా అరోరా వయసు 46. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ ను మొదట పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ 19 ఏళ్ళ తరువాత విడాకులు ఇచ్చింది. ఇక ఆ తరువాత తనకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగిస్తూ తన కంటే వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ ని ప్రేమలో పడేసింది. గత కొన్నేళ్లుగా అతనితో డేటింగ్ చేస్తున్న అమ్మడు ఇప్పటివరకు తన ఆలోచనలపై ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు.

క్లారిటీ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

క్లారిటీ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

ఇక అప్పుడప్పుడు యువ నటుడు అర్జున్ కపూర్ మాత్రమే తన పాట్నర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె గురించి మాట్లాడుతూ.. 'ఆమె నన్ను చాలా అర్థం చేసుకోగలదు. ఒకరిని మనం నిజంగా ప్రేమిస్తే వారు ఎలా ఉన్నా ఇష్టపడతాం. నన్ను నన్నుగా ఇష్టపడే తత్వం తనలో ఉంది. తనకు సహనం కూడా ఎక్కువే' అని అర్జున్ క్లారిటీ ఇచ్చారు.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
త్వరలో పెళ్లి..

త్వరలో పెళ్లి..

మలైకా అరోరా, అర్జున్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు గత ఏడాది నుంచి రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో ఆ రూమర్స్ డోస్ కూడా పెరిగాయి. త్వరలో వారిద్దరు కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X