For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ బాబు సినిమాలో మరో ముగ్గురు హీరోలు: ఇద్దరు అలా.. ఇద్దరు ఇలా.. ప్లాన్ అదుర్స్ కదా!

  |

  కొన్నేళ్లుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతున్నాడు. ఈ మధ్య కాలంలోనే అతడు హ్యాట్రిక్ విజయాలను అందుకుని సత్తా చాటాడు. దీనికి కారణం అతడు సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తుండడమే. అందుకే విజయాలతో పాటు మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మరో ముగ్గురు హీరోలు నటిస్తున్నారట. ఆ వివరాలు మీకోసం!

  వరుసగా మూడు విజయాలతో సత్తా

  వరుసగా మూడు విజయాలతో సత్తా

  ఆ మధ్య వరుస డిజాస్టర్లతో ఇబ్బందులు పడ్డాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇలాంటి పరిస్థితుల్లో కొరటాల శివ తెరకెక్కించిన ‘భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి', అనిల్ రావిపూడి తీసిన ‘సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా మూడు హిట్లను అందుకున్నాడు. తద్వారా హ్యాట్రిక్‌ కొట్టిన ఈ స్టార్ హీరో.. ఎన్నో రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

  ‘సర్కారు వారి పాట'తో వస్తున్నాడు

  ‘సర్కారు వారి పాట'తో వస్తున్నాడు

  సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇది వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.

  మహేశ్ బాబు మూవీ నేపథ్యం ఇదే

  మహేశ్ బాబు మూవీ నేపథ్యం ఇదే

  ‘సర్కారు వారి పాట' స్టోరీ గురించి మొదటి నుంచీ ఒకటే మాట వినిపిస్తుంది. అదేమిటంటే.. ఇందులో హీరో తండ్రి బ్యాంక్ మేనేజర్ కాగా.. అతడిని ఓ బిజినెస్‌మ్యాన్ మోసం చేస్తాడట. దీంతో హీరో తండ్రికి చెడ్డ పేరు వస్తుందని తెలిసింది. ఈ నేపథ్యంలో తన ఫాదర్ పరువును కాపాడడంతో పాటు ఆ వ్యాపారవేత్తను పట్టించేందుకు హీరో ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నదే ఈ సినిమా కథ అట.

  ఒకటే అయింది... రెండోది క్యాన్సిల్

  ఒకటే అయింది... రెండోది క్యాన్సిల్

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘సర్కారు వారి పాట'ను ఎప్పుడో ప్రకటించారు. కానీ, పూజా కార్యక్రమాలు గత లాక్‌డౌన్‌లో జరిగాయి. ఇక, ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం అయింది. ఇందులో భాగంగానే దుబాయ్‌లో జరిగిన మొదటి షెడ్యూల్‌లో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ కరోనా కారణంగా రద్దైంది.

   పాన్ ఇండియా రేంజ్ అంటున్నారే

  పాన్ ఇండియా రేంజ్ అంటున్నారే

  ‘సర్కారు వారి పాట' మూవీని మొదట తెలుగులో మాత్రమే రూపొందించాలని చిత్ర యూనిట్ భావించిందట. అయితే, ఇప్పుడు దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ విషయంలో మహేశ్ బాబు ముందడుగు వేస్తున్నాడని కూడా అంటున్నారు. అందుకే నిర్మాతల్లో ఒకడిగా ఉన్న అతడు.. భారీ ఖర్చు చేయబోతున్నాడట.

  భారీ సినిమాలో ముగ్గురు హీరోలు

  భారీ సినిమాలో ముగ్గురు హీరోలు

  భారీ చిత్రం ‘సర్కారు వారి పాట'లో మహేశ్ బాబుతో పాటు పలువురు బడా స్టార్లు కూడా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, వాళ్లు ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది సీనియర్, జూనియర్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మరో ముగ్గురు హీరోలు నటిస్తున్నారట.

  Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu
   ఇద్దరు హీరోలు అలా.. ఇద్దరు ఇలా

  ఇద్దరు హీరోలు అలా.. ఇద్దరు ఇలా


  బయటకు వచ్చిన తాజా సమాచారం ప్రకారం.. ‘సర్కారు వారి పాట'లో మహేశ్ బాబు తండ్రిగా మలయాళ హీరో జయరాం నటిస్తున్నాడట. అలాగే, విలన్‌గా అర్జున్ సర్జా చేస్తున్నట్లు తెలిసింది. వీళ్లతో పాటు మరో యంగ్ హీరో కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాడట. అంటే మొత్తంగా ఇద్దరు సీనియర్ హీరోలు, ఇద్దరు యంగ్ హీరోలు ఇందులో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

  English summary
  Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. Latest Report That.. In This Movie Another Three Heros to play Key Roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X