శృతి హరిహరన్‌కు అర్జున్ షాక్.. నాకు ఓ కూతురు ఉందని.. ఆమెతో అలా ప్రవర్తించలే..

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెదవి విప్పాడు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన నటి శృతిహరిహరన్‌పై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని అర్జున్ స్పష్టం చేశారు. విస్మయ, నిబునన్ చిత్ర షూటింగ్‌ సందర్భంగా తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని అర్జున్‌పై శృతి హరిహరన్ ఆరోపణలు చేయడం దక్షిణాదిలో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

జీర్ణించుకోలేకపోతున్నాను

జీర్ణించుకోలేకపోతున్నాను

నాపై లైంగిక ఆరోపణలు రావడం నాకు షాక్ గురిచేసింది. తను చేసిన ఆరోపణలను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆమె చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే వాటిపై వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకొచ్చాను అని అర్జున్ తెలిపారు.

 నేను అలాంటి సీన్లలో

నేను అలాంటి సీన్లలో

సినీ పరిశ్రమలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నందున్న డైరెక్టర్లు, నిర్మాతలు నన్ను కొన్ని సీన్లు షూట్ చేసేటప్పుడు సలహాలు అడుగుతుంటారు. కొన్నిసార్లు నేను సూచించినట్టు వారు చేస్తారు. లేకపోతే వారికి నచ్చినట్టు తీస్తారు. కొన్నిసార్లు నేను ఇంటిమేట్ సీన్లలో నటించడానికి మొహమాట పడుతుంటాను. సినిమా తప్పనిసరి అయితే అందులో నటిస్తాను అని అర్జున్ చెప్పారు.

అక్కడికి పిలువలేదు

అక్కడికి పిలువలేదు

సినిమా షూటింగ్ సందర్భంలో నాకు భోజనం వస్తే నేను అందర్ని ఆహ్వానిస్తుంటాను. నాకు ఏదైనా భోజనం వస్తే శృతిని లంచ్‌కు పిలిచి ఉండొచ్చేమో. కానీ ఆమెను డిన్నర్‌కు పిలువలేదు అని అర్జున్ వెల్లడించారు. ఆమె నా గురించి తప్పుగా అర్ధం చేసుకొని ఉండొచ్చని అన్నారు.

 నాకు ఓ కూతురు ఉందని

నాకు ఓ కూతురు ఉందని

నాకు ఓ కూతురు ఉంది. ఆమె కూడా సినీ పరిశ్రమలో ఉన్నారు. నటించడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి సమయంలో నేను మరో మహిళతో ఎలా అసభ్యంగా బిహేవ్ చేస్తాను. మీ టూ ఉద్యమం రావడం మంచిదే. కానీ దానిని తప్పుదారి పట్టించకూడదు అని అర్జున్ సూచించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X