రామ్ చరణ్‌పై సురేష్ సెల్వరాజన్ ప్రశంసలు: ఆ మూవీ సెట్‌లో జరిగింది చెబుతూ!

'చిరుత' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాతి సినిమా 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో పాటు స్టార్ హీరో అయిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని అతడు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'తో నిర్మాతగానూ మారాడు చరణ్. దీని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అందించిన అతడు.. ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి 'ఆచార్య'ను నిర్మిస్తున్నాడు.

టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ - చిరంజీవి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'ఆచార్య'. దీనికి సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. తాజాగా ఆయన రామ్ చరణ్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇటీవల 'ఆచార్య' సెట్‌కు వెళ్లాడు మెగా పవర్ స్టార్. ఆ సమయంలో ప్రతి ఒక్కరితో కాసేపు ముచ్చటించాడట.

Art Director Suresh Selvarajan Praises on Ram Charan

ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన సెల్వరాజన్‌.. చరణ్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'సెట్‌లో మీరు చెప్పిన మాటలకు గూస్‌బమ్స్ వచ్చాయి సార్. మీ కాంప్లిమెంట్లను ఎప్పటికీ మర్చిపోలేను. అవి నా పనిలో కసిని మరింతగా పెంచాయి. మీ విలువైన మాటలకు ధన్యవాదాలు సార్' అంటూ రాసుకొచ్చాడు. సెల్వరాజన్ గతంలో 'భరత్ అనే నేను'కు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాడు.

Art Director Suresh Selvarajan Praises on Ram Charan

ఇదిలా ఉండగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆచార్య'లో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే అతడి పార్ట్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని సమాచారం. ఇక, ఈ మూవీలో చరణ్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చినా చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X