ఎన్టీఆర్ మామూలోడు కాదు.. పుట్టుక అంతే, ప్రొడ్యూసర్ గా మారిన నటుడు కీలక వ్యాఖ్యలు!

నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. తనదైన డాన్స్ తో డైలాగ్ డెలివరీతో ఈజ్ తో నటిస్తూ ఆయన అనేక మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన గురించి నటుడు, ఈ మధ్య కాలంలో రిలీజైన అర్థశతాబ్దం సినిమాతో నిర్మాతగా మారిన రాధాకృష్ణ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

ఆది సినిమాతో

ఆది సినిమాతో

అర్థశతాబ్దం సినిమాతో నిర్మాతగా మారిన రాధా కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఆది సినిమాకి సంబంధించిన షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విశేషాలను ఎన్టీఆర్ ప్రవర్తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలను రాధాకృష్ణ పంచుకున్నారు..

 ఎనర్జీతో ఎవరు మ్యాచ్ కాలేరు

ఎనర్జీతో ఎవరు మ్యాచ్ కాలేరు

ముఖ్యంగా ఎన్టీఆర్ పుట్టుక నుంచే ఒక నటుడని ఆయన ఎనర్జీతో ఎవరు మ్యాచ్ కాలేరని చెప్పుకొచ్చారు. ఆది సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను వివరిస్తూ ఎన్టీఆర్ కి పని మీద ఎంత శ్రద్ధ ఉంటుందో తెలిపే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ క్లైమాక్స్ ఫైట్ గోల్కొండ స్కూల్లో చేస్తున్నప్పుడు ఒక గ్లాస్ ని చేతితో గుద్దాల్సి వస్తుందని ఆ సమయంలో ఎన్టీఆర్ చేతికి గాయం అయిందని రాధాకృష్ణ వెల్లడించారు.

గాజు ముక్కలు చేతిలో దిగబడిపోయినా

గాజు ముక్కలు చేతిలో దిగబడిపోయినా


అలా గాజు ముక్కలు చేతిలో దిగబడిపోయినా సరే ఎలాంటి ఆందోళన లేకుండా ఎన్టీఆర్ హాస్పిటల్ కి వెళ్ళాడు అని అక్కడ కుట్లు వేయించుకుని వచ్చి తర్వాత షూటింగ్ పూర్తి చేశాడని చెప్పుకొచ్చారు. ఇక నటుడిగా చాలా సినిమాల్లో కనిపించిన రాధాకృష్ణ ఇటీవలికాలంలో ఆహా వేదికగా రిలీజైన అర్థశతాబ్దం అనే సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అయ్యారు.

అర్థశతాబ్దం

అర్థశతాబ్దం

కార్తీక్ రత్నం, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన అర్థశతాబ్దం సినిమాలో సాయి కుమార్, నవీన్ చంద్ర, శుభలేఖ సుధాకర్, అజయ్ లాంటి అనేక మంది నటులు కనిపించారు. రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది.

Recommended Video

Koratala Siva సాప్ట్ వేర్ జాబ్ వదిలేసి.. Acharya కోసం సెంటిమెంట్ క్విట్ || Filmibeat Telugu
బిజీ బిజీ

బిజీ బిజీ

ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నిజానికి త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అనుకోని కారణాల నేపథ్యంలో ఆ సినిమా క్యాన్సిల్ కావడంతో కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X