రజనీకే గట్టిపోటి.. సత్యం సుందరం హీరో అరవింద్ స్వామి ఆస్తి విలువ ఎన్ని వేల కోట్లు?.. రెమ్యునరేషన్ ఎంత?
సినిమా రంగంలో అందం, యాక్టింగ్‌తో అమ్మాయిల మనసులు దోచుకొన్న అతికొద్ది మంది హీరోల్లో అరవింద్ స్వామి ఒకరు. మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి వచ్చి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్నారు. ఆయన నటించిన రోజా సంచలన విజయం సాధించడంతో ఇంకా ఆయనకు తిరుగులేదని అనుకొన్నారు. కానీ వెండితెర మీద నుంచి 13 ఏళ్లపాటు అలా దూరమయ్యారు. అయితే ఇటీవల సత్యం సుందరం మూవీతో మరోసారి అభిమానుల గుండెల్లో ఒదిగిపోయారు. ఆయన కెరీర్‌కు గ్యాప్ రావడానికి కారణం ఏమిటి? ఆయన నికర ఆస్తులు, సంపాదన, రెమ్యునరేషన్ వివరాల్లోకి వెళితే..
మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అరవింద్ స్వామి తొలుత డాక్టర్ కావాలనుకొన్నారు. అయితే చదువుకొనే రోజుల్లో పాకెట్ మనీ కోసం యాడ్స్‌లో నటించే వారు. అలా ఓ రోజు యాడ్ నటించిన సందర్భంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం కంట్లో పడ్డారు. సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ద్వారా మణిరత్నంను కలిశాడు. దాంతో ఆయన దళపతి చిత్రంలో తొలిసారి అతిథి పాత్రలో నటించారు.

ఆ తర్వాత మణిరత్నం తీసిన రోజా చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటిని సంపాదించుకొన్నారు. అమ్మాయిల కలల రాజుగా మారిపోయాడు. అనంతరం భారీ ఆఫర్లు వచ్చినా ఆచూతూచీ పాత్రలను ఎంచుకొన్నారు. 10 కాలంలో కేవలం 15 సినిమాల్లోనే నటించారు. అయితే అయినా ఆయనకు క్రేజ్, డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని సినీ వర్గాలు వెల్లడిస్తారు.
ఓ సందర్భంలో రజనీకాంత్‌కు పోటీ అనే ఫీలింగ్ కల్పించిన ఈ అందగాడు 2000 సంవత్సరం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కుటంబానికి చెందిన వ్యాపారం, సాఫ్ట్ వేర్ కంపెనీ వ్యహారాలు చేపట్టారు. అలా తన ఫ్యామిలీ కంపెనీల నిర్వాహణను కొనసాగించారు. ఆ తర్వాత 2006 సంవత్సరంలో శాసనం అనే సినిమాలో నటించారు. అనంతర మళ్లీ బ్రేక్ తీసుకొని కాదల్ చిత్రం ద్వారా 2013 నుంచి వరుసుగా సినిమాలు చేస్తున్నారు. ఆయన టించిన తని ఒరువన్ సినిమా భారీ విజయం సాధించడంతో ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తాయి.
తెలుగులో తని ఒరువన్ సినిమా రీమేక్ చేయగా, రామ్ చరత్‌తో కలిసి నటించారు. ఆ తర్వాత భోగన్, చెక్క చివాంత వానమ్, కస్టడీ లాంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు. ఇటీవల ఆయన నటించిన సత్యం సుందరం సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కంటతడి పెట్టించేలా నటనతో మెప్పించారు. ఆయన గాంధీ టాక్స్ అనే సినిమాలో నటిస్తున్నారు.

తన కుటుంబ వారసత్వంగా వచ్చిన వీడీ స్వామి అండ్ కంపెనీ బాధ్యతలు చేపట్టి ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ప్రవేశించారు. ఇంటర్‌ప్రో గ్లోబల్ సీఈవీ, ప్రో లీస్ ఎండీ, చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయన తన నికర ఆస్తి సుమారుగా 3500 కోట్ల రూపాయలుగా లెక్కించారు. ఆయన ప్రస్తుతం ప్రతీ సినిమాకు 5 నుంచి 10 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకొంటారని సినీ వర్గాలు వెల్లడిస్తారు.


Click it and Unblock the Notifications











