ప్రధానిని చంపే ఉగ్రవాదిగా.. సూర్య 'కాప్పన్'లో ఆర్య పాత్ర ఇదే!
ప్రముఖ దర్శకుడు కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కాప్పన్. సూర్య హీరోగా నటిస్తున్నాడు. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన అయాన్, బ్రదర్స్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. దీనితో కాప్పన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఉత్కంఠ భరితంగా చిత్రాలు తెరకెక్కించడంలో కెవి ఆనంద్ సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో మోహన్ లాల్, హీరో ఆర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆర్య నటిస్తున్న పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. మోహన్ లాల్ ప్రధాని పాత్రలో కనిపించనున్నారు. ప్రధానిని చంపాలని ప్రయత్నించే ఉగ్రవాదిగా ఆర్య పాత్ర ఉంటుందని అంటున్నారు. ఆర్య కెరీర్ లోనే ఈ పాత్ర చెప్పుకోదగ్గదిగా మిగిలిపోతుందని అంటున్నారు. ఇక సూర్య ప్రధానికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉంటాడట. ఈ కథని కెవి ఆనంద్ ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

సాయేషా సైగల్ కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో నటిస్తోంది. సూర్య నటించిన ఎన్ జి కె చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తర్వాత కాప్పన్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











