Prabhas: ప్రభాస్ విషయంలో నిజమైన వేణుస్వామి జోస్యం.. షాక్ కలిగించే వీడియో వైరల్
ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ప్రముఖులకు జాతకాలు చెబుతూ.. తరుచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక ఆయన చెప్పిన జాతకాలు దాదాపు నిజం కావడంతో జనాలు కూడా నమ్ముతుంటారు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చెప్పిన జోస్యం నిజమైందని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. అసలు అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేణు స్వామి.. సెలబ్రేటీల జాతకం చెబుతూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. సెలబ్రేటీల జాతకాలతో పాటు.. ఇంట్లో పూజలు కూడా చేస్తారు. మొన్నటికి మొన్న అషూ రెడ్డి కారుకు పూజలు చేసి.. మళ్లీ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈయన చెప్పినవి 90 పర్సంట్ కరెక్ట్ కావడంతో.. చాలా మంది వేణుస్వామి జోస్యాన్ని నమ్ముతారు. అయితే ప్రభాస్ గురించి చెప్పిన మాటలు.. అప్పట్లో సెన్సేషన్ సృష్టించాయి.

గతంలో ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆయన చెప్పిన మాటలు నిజమయ్యాయని నెట్టింట్లో వీడియోలు వైరల్ గా మారాయి. అసలు విషయం ఏమిటంటే.. గతంలో వేణు స్వామి ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన జాతక ప్రకారం ఆయనకు వివాహం అనేది కష్టం. జరిగితే సమస్యలు తలెత్తుతాయి... అంటూ వేణుస్వామి చెప్పుకువచ్చాడు. అంతే కాదు.. ఆయన జాతకంలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొన్న సినిమా ఎందుకు పోయిందో అందరికీ తెలుసు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ముగ్గురు నలుగురికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అభిమానులు బాధపడుతారు కాబట్టి బయటకు తీసుకురారు.. అంటూ వీడియోలో వేణుస్వామి చెప్పుకువచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పింది నిజమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
అయితే అంతలా నమ్మడానికి కారణం.. ప్రభాస్ ఇటీవల యూరప్ వెళ్లారు. అది కూడా ఓ సర్జరీ చేయించుకోవడం కోసం ప్రభాస్ యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభాస్ చాలా కాలంగా కాలు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మోకాలి నొప్పి ఎక్కువవ్వడంతో... దానికి సర్జరీ చేయించుకునేందుకు ఆయన యూరప్ వెళ్లారని సమాచారం. సర్జరీ సక్సెస్ పుల్ గా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
వేణు స్వామి చెప్పినట్లుగా ప్రభాస్ జీవితంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తోంది. దీంతో వేణు స్వామి చెప్పిన జోస్యం నిజం అవుతుందని నెట్టింట వైరల్ గా మారుతోంది. మరి ఈ లెక్కన ప్రభాస్ గురించి ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. పెళ్లి, కెరియర్, ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయనకు బహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ రాలేదు. ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదు. ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ నిజం అవ్వడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.


Click it and Unblock the Notifications











