Prabhas: ప్రభాస్‌కు అందుకే కష్టాలు... దూరమైపోతాడు అంటూ వేణుస్వామి సంచలనం

సినీ పరిశ్రమలో అనేకమంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలు చెబుతూ హాట్ టాపిక్ అవుతున్న వేణు స్వామి... తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆయన జాతకం చెప్పారు. ప్రభాస్ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి ఒకరకంగా సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రభాస్ గురించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? ఏమేం చెప్పారు? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఒకరకంగా బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్ లోనే సినిమాలు చేస్తున్నారు. అయితే దారుణమైన విషయం ఏమిటంటే... పాన్ ఇండియా లెవెల్ లో ఆయన చేస్తున్న ఏ ఒక్క సినిమా కూడా వర్కౌట్ అవడం లేదు. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన సాహో దారుణంగా బోల్తా పడితే ఆ సినిమా తర్వాత కూడా ఆయన వరుస సినిమాలు ఒప్పుకున్న చాలా గ్యాప్ తర్వాత రాధే శ్యాం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

Astrologer Venu Swamy Sensational Comments on Prabhas Future and His Marriage

కానీ రాధేశ్యాం సినిమా కూడా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.. ఇక ఈ రాదే శ్యామ్ సినిమా తర్వాత ఆదిపురుష్ సినిమా విషయంలో కొంత వెనక్కి తగ్గి మళ్లీ అనేక మార్పులు చేర్పులు చేసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినా ఆ సినిమా కూడా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల మీద అటు ప్రేక్షకులలో ఇటు ప్రభాస్ అభిమానుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా ప్రభాస్ జాతకం గురించి ఇప్పుడు వేణు స్వామి బాంబు పేల్చాడు. ప్రభాస్ జాతకంలో ఒక పాము ఉందని దాని కారణంగా మంచి పేరు అయితే ప్రభాస్ కు వస్తుంది.. కానీ ఎక్కువ కాలం నిలబడలేరని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రభాస్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న ప్రభాస్ పెళ్లి గురించి కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే ప్రభాస్ పెళ్లి ఆలస్యం అవుతుందని... ఒకవేళ పెళ్లి చేసుకున్న సరే అనేక సమస్యలు వస్తాయని బయటపెట్టారు.

Astrologer Venu Swamy Sensational Comments on Prabhas Future and His Marriage

జాతకంలో ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు ఒంటరిగా ఉండిపోతారని బాంబు పేల్చిన వేణు స్వామి... ఇలాంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని చెప్పుకొచ్చారు. ప్రభాస్ అమ్మాయిలకు బాగా ఇష్టమైన వ్యక్తిగా ఉంటాడని... అయితే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండే అవకాశం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్, అరవిందస్వామి వంటి వారు కూడా అమ్మాయిలకు బాగా ఇష్టమైన వ్యక్తులుగా ఉండేవారని అయితే వారు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలబడలేకపోయారని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి కూడా అదే అయ్యే అవకాశం ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరోవైపు ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటి అనేది కింద కామెంట్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X