Anand Devarakonda: ఆమె వల్ల 5 ఏళ్లు పిచ్చోడినయ్యా... బేబీ హీరో రియల్ లైఫ్ బ్రేకప్ స్టోరీ

ప్రేమ.. ఎంత హాయిని ఇస్తుందో.. అంతకంటే ఎక్కువ పెయిన్ ఇస్తుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరిగేది. అయితే మన బేబీ హీరోకు కూడా ప్రేమ వల్ల పిచ్చోడినియ్యాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. తొలిసారిగా ఈ హీరో తన మొదటి లవ్ స్టోరీనీ, బ్రేకప్ స్టోరీని బయటపెట్టాడు. ఐదేళ్లు పిచ్చోడినయ్యానంటూ ఎమోషనల్ అయిపోయాడు. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఆనంద్ దేవరకొండ... టాలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా దొరసాని. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటించింది. వీరికి ఇది తొలి సినిమా. ఇక ఈ సినిమాతో ఇద్దరికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం రాలేదు. ఇక కరోనా టైంలో ఆనంద్ దేవరకొండ ఓటీటీలో మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Baby Movie Hero Anand Devarakonda Opens Up About His First Breakup Story Full Details Here

ఇక మిడిల్ క్లాస్ మెలోడిస్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చేశాడు ఆనంద్. ఆ తర్వాత పుష్పక విమానం, హైవే వంటి చిత్రాలు తీశాడు. ఇవి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక సాయి రాజేశ్ దర్శకత్వంలో బేబీ అనే చిత్రంలో నటించాడు. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యుత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

డిఫరెంట్‌ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సినిమా కథల ఎంపికలో ఆనంద్‌ దేవరకొండ చాలా విభిన్నంగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. బేబీతో బ్లాక్‌ బస్టర్‌ మూవీని ఖాతాలో వేసుకున్న ఆనంద్ దేవరకొండ.. ఆ సినిమాలో హీరోయిన్ ను గాఢంగా ప్రేమిస్తాడనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఎంత వేదన అనుభవించాడో తెలిసిందే.

అయితే ఆయన రియల్ లైఫ్ లో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పుకువచ్చాడు. తన నిజ జీవితంలోనూ అలాంటి నరకం చూశానని తెలిపాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆనంద్‌ దేవరకొండ తన తొలి ప్రేమ ముచ్చట్లు, బ్రేకప్‌ బాధను బయటపెట్టాడు. తన మొదటి ప్రేమకథలో తాను ప్రేమించిన అమ్మాయి ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిందని... తాను కూడా అమెరికా వెళ్దామని ఎప్పటినుంచో ప్లాన్స్ వేసుకున్నట్లు తెలిపాడు.

Baby Movie Hero Anand Devarakonda Opens Up About His First Breakup Story Full Details Here

చికాగో చుట్టుపక్కల ఏదైనా ఒక యూనివర్సిటీలో ఉందామనుకున్న ఆనంద్ దేవరకొండ... అమెరికాలోని టాప్‌ 5 ఇంజనీరింగ్‌ కళాశాలలకు అప్లై చేశాడట. అక్కడ ఓ సీటు కూడా దొరికిందని చెప్పుకువచ్చాడు. ఇక చికాగో వెళ్లిపోయాక ఇద్దరం కలిసి ఉండోచ్చని భావించిన ఆనంద్ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవనుకున్నాడట. అయితే అక్కడికి వెళ్లాక వ్యవహారం బెడిసి కొట్టిందని బయటపెట్టాడు.

నా గుండె పగిలిపోయింది... ఆ బ్రేకప్‌ బాధ నుంచి బయటపడటానికి సుమారు నాలుగైదేళ్లు పైగానే పట్టిందని ఆనంద్ ఎమోషనల్ అయిపోయాడు.. తాను తనను ఎంతో నిజాయితీగా ప్రేమించానని... కానీ వర్కవుట్‌ కాలేదని తెలిపాడు.. లవ్‌ ఫెయిల్యూర్‌ తో చాలా బాధపడ్డాననని చెప్పుకువచ్చాడు. ఈ విషయం తెలుసుుకున్న ఆనంద్ ఫ్యాన్స్... బేబీ సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ ఇంతేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X