Ram Charan birthday కోసం భారీ సర్‌ప్రైజ్‌లు.. గ్యాప్ లేకుండా ప్లాన్ చేస్తున్న మెగా పవర్ స్టార్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమా అనంతరం మరిన్ని పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వీలైనంత వరకు ప్రభాస్ తరహాలోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం శంకర్ తో తో 15వ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కి ఇప్పుడు మరొక పెద్ద టాస్క్ మొదలైంది. మార్చి 27న పుట్టినరోజు కావడంతో తప్పకుండా ఆ రోజు ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్‌లు కోరుకుంటారు. ఇక రామ్ చరణ్ సినిమాలు వరుసగా లైనప్ లు ఉండడంతో ఎదో ఒక అప్డేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ రోజు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు అనే వివరాల్లోకి వెళితే..

మరోసారి ప్రమోషన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొత్తానికి RRR సినిమా విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి మార్చి 25 వ తేదీన విడుదలకు రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో మరోసారి పాల్గొనాలని రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఆచార్య కోసం కూడా
RRR సినిమాతో పాటు త్వరలోనే ఆచార్య సినిమాతో కూడా రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో అలరించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా రామ్ చరణ్ బిజీ అయ్యే అవకాశం ఉంది.

పుట్టినరోజు సందర్భంగా
రామ్ చరణ్ ఒకవైపు సినిమాల ప్రమోషన్స్ తో పాటు మరొక వైపు రెగ్యులర్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాల్సి ఉంది. మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వాటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్
అంతేకాకుండా రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. అంతే కాకుండా పుట్టినరోజు ఏదైనా ఫ్యాన్స్ కు అప్డేట్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈసారి రామ్ చరణ్ పుట్టిన రోజున బ్యాక్ టు బ్యాక్ చాలా అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా అదేరోజు రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులు కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ దర్శకుడితో కూడా..
రామ్ చరణ్ ఇటీవల ముంబై వెళ్లిన విషయం తెలిసిందే అక్కడ ఒక అగ్ర దర్శకుడు తో కూడా కొత్త ప్రాజెక్టు పై చర్చలు జరిపినట్లు సమాచారం. సంజయ్ లీలా బన్సాలీ పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఆయనతో లేదా మరొక యాక్షన్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో చాలా కథనాలు వెలువడ్డాయి. ఒకవేళ ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రాజెక్ట్ ఓకే అయితే పుట్టినరోజు స్పెషల్ గా ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











