Prabhas అభిమానులకు గుడ్ న్యూస్.. వరుస అప్డేట్స్ తో సర్‌ప్రైజ్‌లు రెడీ!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈ రెండు వారాలు కూడా సెలబ్రేషన్స్ తో సోషల్ మీడియాలో చాలా హడావిడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే పుట్టినరోజు సందర్భంగా బిల్లా సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన షోలు కూడా ప్రదర్శించారు. అలాగే మరికొన్ని హిట్ సినిమాల స్పెషల్ షోలు కూడా ప్రదర్శించబోతున్నారు. అయితే ఎక్కువగా అందరి ఫోకస్ మాత్రం బిల్లా సినిమాపైనే ఉంది. ఇప్పటికే 4K వెర్షన్లో సినిమాను రెడీ చేశారు. అయితే ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న కాబట్టి మిగతా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ రెండు వారాల్లో రాబోతున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమా షూటింగ్ అయితే అయిపోయింది. ప్రస్తుతం సలార్ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా దాదాపు సగం పూర్తయింది. ఇక ఈ మూడు సినిమాల తో పాటు త్వరలోనే మారుతీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

ముఖ్యంగా మారుతీ అయితే 21 లేదా 22వ తేదీన ప్రభాస్ కు సంబంధించిన స్పెషల్ లుక్స్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఫోటోషూట్ కోసం ప్రణాళిక కూడా రచించినట్లు టాక్ అయితే వినిపిస్తోంది. ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా సరికొత్తగా ఆ సినిమాలో కనిపిస్తాడట. ఇక ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ కూడా రావాల్సి ఉంది. ఫస్ట్ టీజర్ కాస్త నిరుత్సాహపరచడంతో ఇప్పుడు సెకండ్ టీజర్ తో మరింత ఆకట్టుకునే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు రెడీ అవుతున్నారు.
అలాగే సలార్ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన టీజర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అత్యధిక భారీ బడ్జెట్ తో తెరపైకి రాబోతున్న ప్రాజెక్ట్ K అప్డేట్ కోసం కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే ఒక స్పెషల్ పోస్టర్ రెడీ చేసినట్లు సమాచారం. తప్పకుండా ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది అని సమాచారం. మరి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వచ్చే అప్డేట్స్ లో ఏది ఎక్కువగా హైలెట్ గా నిలుస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











